Police case filed against Bandi Sanjay’s Son: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదు
Police case filed against Bandi Sanjay’s Son: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సాయి భగీరథ్ చదువుతున్న కాలేజీలో తన జూనియర్ విద్యార్ధిని ర్యాగింగ్ చేస్తూ ఆనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు చేశారు. నగర శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నగర శివారులోని ఓ కాలేజీలో సాయి భగీరథ్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతను తన జూనియర్‌ను ర్యాగింగ్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తానేమైన బ్రోకర్ ల***కొడుకుని అనుకుంటున్నావా? మినిస్టర్‌కి ఫోన్ చేస్తావారా? అంటూ బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడని అంటూ పలువురు సాయి భగీరథ్‌పై ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసులు ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కొడుకు కావడంతో బీజేపీ నేతలు దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. అదేవిధంగా ఈ విషయంపై ప్రతిపక్షాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి. విద్యార్ధుల అంశం కావడంతో అధికార, ప్రతిపక్షాలు మౌనం వహించి వ్యవహారాన్ని పోలీసులకు వదిలేస్తారా? లేదంటే ఈ అంశాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొని వస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది.