PM Modi: ఫిబ్రవరి 13న హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోడీ
PM Narendra Modi will visit Hyderabad on February 13th
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారయింది. వచ్చే నెల 13వ తేదీన హైదరాబాద్ వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 19న ప్రధాని హైదరాబాద్ పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడింది. అనుకోని కారణాలతో క్యాన్సల్ అయింది. జనవరి 15న వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఫిబ్రవరి 13న పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. పెరేడ్ గ్రౌండ్స్ లో పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు.
తెలంగాణ బీజేపీ నేతల్లో మరింత ఊపు తీసుకువచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్ లో తరచుగా పర్యటిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, తదితర నేతలు తరచుగా హైదరాబాద్ వస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వారిలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు.