Vande Bharat: సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైలు
Vande Bharat Express: జనవరి 19 న సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. ముందుగా ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విజయవాద మధ్య నడవనుంది. ఆ తరువాత ఇదే రైలును విశాఖ వరకు పొడించేందుకు ఆలోచన చేసారు. ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నాలుగు గంటల్లోనే చేరుకొనే అవకాశం కలుగుతుంది.
ప్రధాని మోడీ ఈ నెల 19న ప్రధాని కర్ణాటక గుల్బర్గా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రధాని స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం పర్యటన సమయంలో నిర్ణయం జరిగింది. వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా సికింద్రబాద్ రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ 699 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు.. పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు. దాదాపుగా రూ.4 వేల కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఇక బీజేపీ ఎంపీ జి విఎల్ నరసింహారావు సికింద్రాబాద్ నుండి విశాఖకు వందేభారత్ రైలును పరుగులుపెట్టించాలని అడిగినవెంటనే ఒప్పుకుందుకు ప్రధానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు
ఇక వందేభారత్ ట్రైన్ విషయానికి వస్తే… దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్- ముంబయి సెంట్రల్, హౌరా-న్యూ జల్పాయ్ గురి స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం అందుకోవడం విశేషం.
విశాఖపట్నం మరియు సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలును ప్రారంభించాలనే నా అభ్యర్థన మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్‌కు వందేభారత్ రేక్‌ను కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు. @narendramodi @AshwiniVaishnaw #vandebharatexpress pic.twitter.com/jNQfgD1sjI
— GVL Narasimha Rao (@GVLNRAO) January 9, 2023