PM Modi: ఈనెల 19న హైదరాబాద్ కు ప్రధాని
PM Modi: దేశంలో పలు ప్రాంతాల్లో పరుగులు తీస్తున్న వందేభారత్ రైలు తెలుగురాష్ట్రాల్లో కూడా రాబోతున్నది. ఈనెల 19 వ తేదీ నుండి ఈ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు తీయనున్నది. వందేభారత్ రైలును ప్రారంభించేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. వందేభారత్ రైలు ప్రారంభంతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికరణ పనులను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా, సికింద్రాబాద్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ రైలు గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణం చేస్తుంది. సికింద్రాబాద్, కాజీపేట మీదుగా ఈరైలు విజయవాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్- విజయవాడ మధ్య సర్వీసును కొన్ని రోజులపాటు కొనసాగించిన తరువాత, ఆ సర్వీసును విశాఖ వరకు పొడిగించనున్నారు. ఇక, సికింద్రాబాద్ నుండి విజయవాడకు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకొవచ్చు. వందేభారత్ రైలు కోసం చాలా కాలంగా తెలుగురాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైలు ప్రయాణం చేసేందుకు అనువుగా పట్టాలను పటిష్టం చేశారు. సాధారణంగా సూపర్‌ఫాస్ట్ రైళ్లు గంటకు 110 కిమీ వేగంతో ప్రయాణం చేస్తుంటాయి.