Vande Bharat: వందే భారత్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
PM Modi flaggs off 8th Vande Bharat express train of India
తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్ధం వందే భారత్ రైలు సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా వందే భారత్ రైలును ప్రారంభించారు. వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు సంక్రాతి కానుక అని ప్రధాని మోడీ అన్నారు. వందే భారత్ ప్రారంభోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
భద్రతతో పాటుగా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏర్పాటు చేసినట్లు ఈ రైలు ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు టూరిజం అభివృద్ధి చెందడానికి కూడా తోడ్పడనుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైల్వే రంగంలో గతం ఎనిమిది సంవత్సరాల్లో జరిగిన ప్రగతిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వివరించారు. గత ప్రభుత్వాలు రైల్వేల అభివృద్ధి విషయంలో శ్రద్ధ వహించలేదని గుర్తుచేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వేలలకు అస్సలు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, గత ఎనిమిది సంవత్సరాల నుంచి పరిస్థితి మారిందని ప్రధాని వివరించారు. హెరిటేజ్ ట్రైన్స్, విస్టా డోమ్ వంటి వాటిని ప్రధాని గుర్తుచేశారు.
ప్రధాని ఈ రోజు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు షెడ్యూల్ రేపటి నుంచి వేరే విధంగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ లో బయలు దేరే వందే భారత్ రైలు రాత్రి 11.30కు విశాఖ చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5.45 నిమిషాలకు విశాఖ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Makar Sankranti gift for the people of Telangana and Andhra Pradesh 🚝
Hon’ble PM @narendramodi Ji flagged off the Vande Bharat Express Between Secunderabad and Visakhapatnam today, which will enhance connectivity and boost tourism.#VandeBharat pic.twitter.com/zY4dJ57uWp
— Meenakashi Lekhi (@M_Lekhi) January 15, 2023
The wait is over. #VandeBharat#RailInfra4Telangana#RailInfra4AndhraPradesh
Watch Live: https://t.co/qyGqHV8qal pic.twitter.com/lVjiqxPsn7
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 15, 2023
#VandeBharat Express between Secunderabad and Vishakapatnam is equipped with advanced safety features and facilities#RailInfra4Telangana#RailInfra4AndhraPradesh pic.twitter.com/eJRWl06kY5
— Southern Railway (@GMSRailway) January 15, 2023