PawanKalyan: కొండగట్టుకు అంజనీపుత్రుడు..జనసైనికుల సందడి
PawanKalyan: ఆంధ్రప్రదేశ్ లో ‘వారాహి’ వాహనం అతిత్వరలోనే రోడ్డెక్కనుంది. అంతకంటే ముందు తెలంగాణాలో ‘వారాహి’ రథం నేడు తెలంగాణాలో రోడ్డెక్కనుంది. కొండగట్టు ఆలయంలో ఈ వాహనానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. ఆ తరువాత ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణకు చెందిన జనసేన పార్టీ ముఖ్యులతో పవన్ కల్యాణ్ అక్కడే సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి..తెలంగాణ పైకూడా ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ లోకల్ నేతలతో సమావేశం అయి రానున్న ఎన్నికల్లో ఎన్నిసీట్లల్లో పోటీచేయాలి. ప్రజల్లోకి జనసేన వాదాన్ని ఎలా తీసుకెళ్ళలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పవన్ రాకతో కొండగట్టు, ధర్మపురి ఆలయంలో బారి బందోబస్తు ఏర్పాటు చేసారు. పవన్ రాకతో జనసేన నేతలు,అభిమానులు దారిపొడవునా భారీ స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు.
కాసేపటిక్రితమే పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. ఆయనతో పాటు జనసేన కీలక నేతలు కూడా వెంటవెళ్లారు. ఉదయం 11 గంటలకు అంజన్న దర్శనం చేసుకుని, ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివార్లలోని రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన వారితో చర్చించనున్నరు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ను మొదలుపెట్టనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.