Manikrao Thakre: కలిసి పనిచేయండి టి కాంగ్రెస్‌నేతలకు.. మాణిక్‌రావ్ ఠాక్రే వెల్లడి
Manikrao Thakre: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న మాణిక్‌రావ్ ఠాక్రే.. తొలిసారి బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. మాణిక్ రావ్ ఠాక్రేకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు.ఇక గాంధీభవన్‌లో చాలాకాలం నుంచి దూరం దూరంగా ఉంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతాగాంధీభవన్ లో దర్శనమిచ్చారు.
తెలంగాణాలో కాంగ్రెస్ కు సానుకూల పరిస్థితే ఉందని రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా అందర్నీ కలుపుకొపోతేనే సానుకూల ఫలితం వస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు సీనియర్లు ఠాక్రే కు విన్నపించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా పలువురు సీనియర్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపైనే ప్రధానంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
వీటన్నింటినీ సావధానంగా విన్న ఠాక్రే.. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, రేవంత్‌రెడ్డి గురించి వదిలేసి ఎవరి పని వారు చేసుకోవాలని సీనియర్లకు పార్టీ ఎప్పుడు అందగానే ఉంటుందని ఆయన హామీ ఇచ్చాడు. నేడు ఉదయం 10.30 గంటలకు డీసీసీ అధ్యక్షులతో ఠాక్రే సమావేశం కానున్నారు. 2023లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎలా ముందుకుపోవాలని, పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని, రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలొస్తే పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఆరా తీయనున్నారని తెలుస్తుంది.
నేడు ప్రధానంగా హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి జరిగే పాదయాత్రలపైన సమీక్ష జరుగనుంది. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం ఇతర సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు.