Kriya Yoga: పరమహంస యోగానంద క్రియాయోగ పాఠాలు తెలుగులో
Kriya Yoga: పూజ్య యోగ గరు పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ పుస్తకం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటి. ఈ గ్రంధం ఇంగ్లీష్ తో పాటు వివిధ భాషల్లో అనువాదమై అన్ని భాషల్లోనూ విరివిగా అమ్ముడుపోయింది. కాగా, హైదరాబాద్‌లో పరమహంస యోగానంద ఆద్యాత్మిక కేంద్రం ఉన్నది. ఈ కేంద్రంలో గురుపరంపరలో అవతార్ బాబాజీ తన శిష్యుడైన లాహిరి మహాశయులకు క్రియాయోగను బోధించారు. అనంతరం ఆ క్రియా యోగను తన శిష్యుడైన యోగిశ్వర్ మహారాజ్‌కు లాహిరి మహాశయులు బోధించారు. అనంతరం, ఆ విధ్యను యుక్తేశ్వర్ మహరాజ్ తన శిష్యుడైన యోగానంద పరమహంసకు బోధించారు. అనంతర కాలంలో యోగానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లి అక్కడ క్రియాయోగను ప్రచారం చేశారు.
పరమహంస నేతృత్వంలో దేశవిదేశాల్లో అనేక ప్రాంతాల్లో క్రియాయోగ బోధనా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటి వరకు ఈ బోధనలు ఆంగ్లం, హిందీ భాషల్లో మాత్రమే బోధిస్తూ వచ్చేవారు. కాగా, ఇప్పుడు తెలుగులో కూడా బోధిస్తున్నారు. పరమానంద యోగసాక్షాత్కార పాఠాలను తెలుగు అనువాదాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద, బ్రహ్మచారి కేదారినంద్ జీ లు విడుదల చేశారు. యోగా, ధ్యానం ఈ ప్రాచీన, ఆత్మను జాగృతం చేసే ప్రక్రియ అంధయుగాలలో శతాబ్దాలుగా కనుమరుగు అయిపోయింది.
కేవలం తపస్వులకు మాత్రమే బోధించబడింది. కానీ 1861 శరదృతువులో హిమాలయ పర్వతాలలోని ఒక మారుమూల గుహలో, గొప్ప యోగి-గృహస్థుడైన లాహిరీ మహాశయులు తన గురువు మహావతార్ బాబాజీని మొదటి సారిగా కలుసుకున్నారు, ఆయన నుంచి క్రియాయోగాన్ని స్వీకరించారు. అక్కడి నుంచి శిష్య పరంపరకు క్రియాయోగం బోధించబడుతూ వస్తున్నదని స్వామి స్మరణానంద పేర్కొన్నారు.