LPG Prices Hike: వినియోగదారులకు షాక్… మళ్లి పెరిగిన వంటగ్యాస్ ధరలు
Gas Prices Hike: దేశంలో నిత్యావసర వస్తువుల జాబితాలో వంటగ్యాస్ కూడా ఒకటి. అయితే, ఈ వంట గ్యాస్‌ను ప్రభుత్వం కాకుండా ఇంధన రిటైల్ సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ముడి చమురు ధరలను అనుసరించి ప్రతి నెల మొదటి తారీఖున ధరలను మార్పు చేస్తుంటుంది. తాజాగా ఇంధన ధరలో వచ్చిన మార్పుల ఆధారంగా గ్యాస్ ధరలను సవరించింది. ఈ సవరణల ప్రకారం, ఇంటికోసం వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 19.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ ధరను ఏకంగా రూ. 350 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరల ప్రకారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధర రూ. 1155కి చేరింది.
అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ ధర ఢిల్లీలో రూ. 2119.50కి చేరింది. కేంద్రం ప్రభుత్వం గ్యాస్ ను పేద ప్రజల కోసం సబ్సీడీలో గ్యాస్‌ను అందిస్తున్నది. డొమెస్టిక్ గ్యాస్‌ను ఏడాదికి 12 చొప్పున అందిస్తుంటారు. అయితే, కమర్షియల్ విషయానికి వస్తే ఎన్ని గ్యాస్ సిలిండర్లైనా తీసుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్ ధరలు పెరుగుతుండటంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా అనేక దేశాల్లో గ్యాస్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ, భారత్‌లో ఈ ధరలను స్థిరంగా ఉండేలా చూడటం గమనార్హం. రష్యానుండి చౌకగా ఆయిల్‌ను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.