Revanth Reddy: పరేడ్ పెట్టకపోవడం అంబెడ్కర్ ని అవమానించడమే ..రేవంత్ రెడ్డి
Revanth Reddy: గాంధీభవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ హత్యలు, హత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలి. పార్టీ ఫిరాయింపుల పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పరేడ్ పెట్టకపోవడం అంబెడ్కర్ ని అవమానించడమే అనిఅన్నారు. గవర్నర్ అన్న గవర్నర్ వ్యవస్థ అన్న కేసీఆర్ కు నచ్చడంలేదని అన్నారు.
గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉంటే మరో వేదికపై ప్రదర్శించాలి. ఇద్దరి మధ్య విభేదాలకు గణతంత్ర దినోత్సవాన్ని వేదికగా మార్చుకోవడం మంచిది కాదు. పరేడ్ కోసం ఈరోజు కోర్టుమెట్లెక్కాలిసిన పరిస్థితి వచ్చినదన్నారు. అంబేద్కర్ విగ్రహం కోసం కోట్లు ఖర్చు పెట్టినా ఈ ప్రభుత్వం ఇంతవరకు పూర్తి చేయలేదని ఎద్దేవచేసారు.బిఆర్ఎస్ నుండి కొందరు బీజేపీ లోకి వెళ్లిన తరువాత అక్కడ కేసీఆర్ కోవర్టులు ఉన్నారని తెలిసింది వాళ్లకు ఇప్పుడు అక్కడ ఉండలేక బయటకి రాలేక ఇబ్బంది పడుతున్నారు.. నేను మొదటి నుండి చెప్తున్న మాటలే ఈటెల రాజేందర్ చెప్పారన్నారు. రిజర్వేషన్లను పేదలకు దూరం చేసే కుట్ర ఈ రాష్టంలో జరుగుతూందోన్నారు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.