ఈరోజు సివిల్స్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. దేశం మొత్తంమీద 933 మంది పరీక్షల్లో ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాల్లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. మొదటి నాలుగు ర్యాంకుల్లో మూడో ర్యాంకును తెలంగాణకు చెందిన నూకల ఉమాహారతి సొంతం చేసుకుంది.
UPSC Results: ఈరోజు సివిల్స్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. దేశం మొత్తంమీద 933 మంది పరీక్షల్లో ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాల్లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. మొదటి నాలుగు ర్యాంకుల్లో మూడో ర్యాంకును తెలంగాణకు చెందిన నూకల ఉమాహారతి సొంతం చేసుకుంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లోని సీతారాం నగర్ కాలనీకి చెందిన ఉమాహారతి మూడో ర్యాంకును సాధించడం విశేషం. దీంతో ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెళ్లివిరిశాయి. ఉమాహారతి తండ్రి నూకల వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. తండ్రి బాటలోనే మంచి ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నది ఉమాహారతి. సివిల్స్ మొదటి ప్రయత్నంలో ఐఆర్ఎస్ ర్యాంకు సాధించారు. అయితే, దానిని వదిలేసుకొని మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుననారు. దీనికోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ఆరునెలలపాటు సివిల్స్ కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్కోసం ప్రిపేర్ అయ్యారు. రెండో ప్రయత్నంలో ఉమా హారతి అన్ని పరీక్షల్లో నెగ్గుతూ వచ్చి సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించారు.
ఇక ఇదిలా ఉంటే ఉమాహారతి సోదరుడు సాయి వికాస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా 9 వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ముంబైలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తండ్రి నారాయణపేట ఎస్పీగా ఉద్యోగం చేస్తుండగా కూతురు, కుమారుడు ఇద్దరూ ఆల్ ఇండియా సర్వీసెస్‌లో ఉద్యోగాలు సాధించడంతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. ఉమాహారతి హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకోగా, బ్రిడ్జి కాలేజీలో ఇంటర్‌ను చదివారు. ఇంటర్ విద్యలో స్టేట్ మొదటి ర్యాంకును సాధించడం విశేషం. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్‌లో మూడో ర్యాంకును సాధించి అందరి మన్నలను పొందారు.