Kama Reddy Master Plan: బండి సంజయ్‌పై కేసు నమోదు
Non Bailable Case on BJP Telangana Chief Bandi Sanjay
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కేసు నమోదయింది. బండి సంజయ్‌తో పాటు మరో 8 మంది నాయకులపై కూడా కేసులు నమోదయ్యాయి. కాటపల్లి వెంకట రమణారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కి వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగడం, రైతులకు బీజేపీ నాయకులు మద్దతు తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని, చనిపోయిన రైతు రాములు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బండి సంజయ్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
దాదాపు రెండు గంటల పాటు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కి పాల్పడ్డారు. ఆందోళన కారులను చెల్లాచెదురు చేశారు. బండి సంజయ్‌ను హుటాహుటిన అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.