Nizam Funerals: వివాదంగా మారుతున్న నిజాం అంత్యక్రియలు
Nizam Funerals:హైదరాబాద్‌నిజాం సంస్థానం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మనుమడు ముఖరంఝా కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ముకర్రంజా భౌతికకాయాన్ని నేడు హైదరాబాద్ కు తీసుకురానున్నారు.
ముఖరం ఝా కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కా మసీదులో ఆయన సమాధిని ఉంచేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో భౌతికకాయాన్ని ఉంచుతారు. ఆతర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ముఖరం ఝా కి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అధికారిక లాంఛనాలకు విశ్వహిందూ పరిషత్ అడ్డుచెపుతోంది. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో విలీనం చేసేందుకు ప్రయత్నం చేసిన నిజాం దేశద్రోహ చర్య మరిచారా అని ప్రశ్నిస్తున్నారు
నిరంకుశత్వానికి మారుపేరులాంటి నిజాం వంశస్థుడికి అధికారలాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే ఉరుకోము అంటూ హెచ్చరిస్తున్నారు. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదని, అలా చేస్తే తెలంగాణా పోరాటాల చరిత్రను, నిజాం వ్యతిరేక పోరాటంలో నాటి ప్రజలు చేసిన త్యాగాలను అవమానించడమేనని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.