NIFT Director: మూగ జీవులపై దాడికి పాల్పడ్డ నిఫ్ట్ డైరెక్టర్
NIFT Director attack on dogs: మూగ జీవులపై నిఫ్ట్ డైరెక్టర్ కౄరత్వాన్ని ప్రదర్శించాడు. నిఫ్ట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆదేశాలతో మాదాపూర్‌లోని నిఫ్ట్ క్యాంపస్‌లోకి వచ్చిన కుక్కలను సెక్యూరిటీ గార్డులు చిత్రహింసలకు గురిచేశారు. కుక్క పిల్లలపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడంతో ఓ మూగ జీవి కాలు విరగ్గా, మరో కుక్క పిల్ల వెన్నెముక విరిగింది. క్యాంపస్ నుంచి కుక్క పిల్లలను బయటికి వెళ్లగొట్టేందుకు డైరెక్టర్ ఈ అరాచకాన్ని సృష్టించాడు. మూడు నెలల క్రితమే కుక్క పిల్లలను హింసించకూడదని GHMC క్యాంపస్ డైరెక్టర్‌కు సూచించగా ఆయన గ్రెటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మాటలను పట్టించుకోలేదు. నిఫ్ట్ యూనివర్సిటీలో ఉన్న స్ట్రీట్ డాగ్స్‌కు ఇటీవలే వ్యాక్సినేషన్ పూర్తి చేశారు అధికారులు. దీంతో పాటు ఆ యూనివర్సీటీలోని విద్యార్థులతో కుక్కలకు అనుబంధం పెరగటంతో అవి అక్కడి నుంచి వెళ్లడంలేదు.
గతంలో నర్సాపూర్ కమిషనర్ కుక్కలను చంపగా అతన్నిస్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సస్పెండ్ చేశారు. మరోవైపు కుక్కలను కొట్టడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో అర్వింద్, బల్దియా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నిఫ్ట్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఫర్ యానిమల్స్ సభ్యులు కోరుతున్నారు.