Naveen murder Case: నవీన్ మర్డర్ కేసులో ట్విస్ట్.. ఏ2గా నిహారికా రెడ్డి.. ఏ3గా హసన్!
New Twist in Naveen murder Case: అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో కీలక మలుపు తెర మీదకు వచ్చింది. నవీన్ హత్య కేసులో ప్రియురాలి హస్తం కూడా ఉందని తెలుసుకున్న పోలీసులు ఆమె పేరు కూడా చేర్చారు. ప్రియురాల కోసమే నవీన్ ను హరి హర కృష్ణ హత్య చేసినట్టు గుర్తించారు. ముందుగా నవీన్ ను హత్య చేసి ప్రియురాలికి వాట్సాప్ లో ఫోటోలు పంపిన హర హరికృష్ణ ఆ తరువాత ఆమెను అక్కడికి తీసుకు వెళ్లి చూపించినట్టు తెలుస్తోంది. హర హర కృష్ణ ప్రియురాలు నిహారిక రెడ్డిని A2గా చేర్చిన పోలీసులు, హర కృష్ణ మిత్రుడు హసన్ ను A3 చేర్చినట్టు చెబుతున్నారు. నవీన్ ను హత్య చేసి నిహారిక రెడ్డిని తీసుకువెళ్లి హరహర కృష్ణ చూపెట్టినట్టు తెలుస్తోంది. హత్య ఘటనా స్థలంకి వెళ్లి మృతదేహాన్ని చూసిన నిహారిక రెడ్డితో పాటు ఘటనా స్థలాన్ని హరిహర కృష్ణ మిత్రుడు హసన్ కూడా చూసినట్టు తేల్చారు.
ఈ క్రమంలోనే నిహారిక రెడ్డి హాసన్లను నిందితులుగా చేర్చిన పోలీసులు హర హర కృష్ణకు కొంత నగదును కూడా నిహారిక రెడ్డి ట్రాన్స్ఫర్ చేసినట్టు గుర్తించారు. ముందుగా గత నెల 17వ తేదీన నవీన్ ను హరిహర కృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలు శరీరం నుంచి వేరు చేసి వాటిని సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు. హసన్ తో కలిసి హరిహర కృష్ణ, శరీర అవయవాలను మన్నెగూడ పరిసరాల్లో పడేసి హసన్ ఇంటికి చేరుకొని దుస్తులు మార్చుకుని రాత్రి అక్కడే ఉండి, 18వ తేదీ ఉదయం బీఎన్ రెడ్డి నగర్ లో ఉండే ప్రియురాలు నిహారిక వద్దకు వెళ్లాడు.
ఆమె నుంచి ఖర్చుల కోసం 1500 రూపాయలు తీసుకొని ఆ తర్వాత ఫోన్ లో నిహారిక, హసన్ తో సంప్రదింపులు జరిపాడు. 20వ తేదీ సాయంత్రం మరోసారి నిహారిక వద్దకు వెళ్లి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నవీన్ ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఆ తర్వాత నిహారికను ఇంటి వద్ద వదిలాడు. ఇక 21వ తేదీ నవీన్ కుటుంబ సభ్యులు హరిహరకృష్ణకు ఫోన్ చేసి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయి ఖమ్మం, విజయవాడ, వైజాగ్ లో తలదాచుకొని 23వ తేదీ వరంగల్ లో తండ్రి వద్దకు చేరుకున్నాడు.
అయితే అప్పటికే పోలీసులు హరిహరకృష్ణ కోసం గాలిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో వెంటనే పోలీసులకు లొంగిపోవాలని కుమారుడికి సూచించగా 24వ తేదీ హరిహర కృష్ణ హైదరాబాద్ కు వచ్చి హసన్ వద్దకు వెళ్లాడు. హసన్, హరిహర కృష్ణ ఇద్దరూ కలిసి మన్నెగూడలో నవీన్ శరీర అవయవాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి వాటిని తిరిగి తీసుకొని హత్య చేసిన ప్రదేశానికి తెచ్చి తగులబెట్టి ఇద్దరూ బీఎన్ రెడ్డి నగర్ లోని నిహారిక ఇంటికి వెళ్లి స్నానం చేశారు. ఇక అప్పుడు నిహారిక ఇంటి నుంచి బయల్దేరిన హరిహర కృష్ణ ఆ తర్వాత నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.