New traffic signal system in Hyderabad : ఇకపై ట్రాఫిక్ సమస్యలకు చెక్
హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ సిగ్నల్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ రంగులను మార్చే కొత్త అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ATSC) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) దీనిని డెవలప్ చేసింది. ఇది కాంపోజిట్ సిగ్నల్ కంట్రోల్ స్ట్రాటజీ (CoSiCoSt)గా పిలువబడే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడాప్టివ్ కంట్రోల్ అల్గోరిథం. ఇది ఏరియా వారీగా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి టైం సైకిల్, గ్రీన్ స్ప్లిట్‌లు, ఆఫ్‌సెట్‌లను సర్దుబాటు చేస్తుంది. వాహనాల రాకపోకల ఆధారంగా గ్రీన్ సిగ్నల్ టైంను దానంతట అదే నిరంతరంగా సర్దుబాటు చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ ను ATSC, పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ (PSS) కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఉన్న 213 HTRIMS సిగ్నల్స్, 122 ATSC సిగ్నల్స్, 94 పెలికాన్ సిగ్నల్స్ ద్వారా కవర్ చేశారు. 57 ATSC సిగ్నల్స్, ఇప్పటికే ఉన్న 157 HTRIMS సిగ్నల్స్‌తో 57 కారిడార్‌లను నిర్మించాలన్న ప్రాజెక్ట్ లో మెజారిటీ భాగం పూర్తయింది. ఇక ఈ సిగ్నల్స్ ను ఆసుపత్రులు, కళాశాలలు/పాఠశాలలు, పాదచారులు ఎక్కువగా ఉండే వాణిజ్య బహిరంగ ప్రదేశాలు వంటి ప్రదేశాలలో అమర్చబోతున్నారు.