CM KCR: ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం
New Secretariat will be inagurated on April 30
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అధికారులతో పాటు కొత్త సచివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న పనులు గురించి ఆరా తీశారు. సచివాలయాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో కూడా అధికారులతో చర్చించారు. ఏప్రిల్ 30న ప్రారంభిస్తే బాగుందని నిర్ణయించారు. పిబ్రవరి 17న తొలుత ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సచివాలయం ప్రారంభం వాయిదా పడింది.
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.
జూన్ 2న అమర వీరుల స్థూపం ఆవిష్కరణ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన అమర వీరుల స్థూపం ఆవిష్కరించనున్నారు.
నూతనంగా నిర్మితమౌతున్న డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయ పనుల పురోగతిని పర్యవేక్షించిన సీఎం శ్రీ కేసీఆర్.
CM Sri KCR inspected the progress of ongoing construction works of Dr. B.R Ambedkar Telangana State Secretariat. pic.twitter.com/cmLkpodTKf
— BRS Party (@BRSparty) March 10, 2023
#Telangana CM KCR reviewed the construction works of Secretariat, Martyrs Memorial and Dr B R Ambedkar statue pic.twitter.com/U09RY1Aaxt
— Naveena Ghanate (@TheNaveena) March 10, 2023
Telangana CM #KCR inspected the newly constructed #Secretariat complex, at the bank of Hussain Sagar in Hyderabad, today.#Hyderabad #Telangana #TelanganaSecretariat pic.twitter.com/wPBb5KwjTm
— Surya Reddy (@jsuryareddy) March 10, 2023
KCR