New Nizam: కొత్త నిజాం అజ్మత్ జా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
New Nizam of Hyderabad Ajmat Jha
హైదరాబాద్ కొత్త నిజాంగా అజ్మత్ జా ను ఎంపిక చేసినట్లు కుటుంబ సభ్యలు ప్రకటించారు. ఇటీవలే 8వ నిజాం నవాబు ముకరంజా టర్కీలో మరణించారు. అక్కడి నుంచి ముకరంజా భౌతికకాయాన్ని హైదరాబాద్ తరలించి ఇక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత ముకరంజా కుమారుడు అజ్మత్ జాను కొత్త నిజాంగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.
1960లో జన్మించిన అజ్మత్ జా లండన్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఫోటోగ్రఫీలో కోర్సు చేశారు. ఫోటోగ్రపీని వృత్తిగా ఎంచుకున్నారు. కొన్ని హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. ప్రఖ్యాతి గాంచిన గాంధీ సినిమాలో నటించిన రిచర్డ్ అటెన్ బరోతో కలిసి పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ తో కలిసి కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు.
ముకరంజా మొదటి భార్య ఇస్రా కుమారుడైన అజ్మత్ జా, తన తండ్రి కోరిక మేరకు నిజాం ట్రస్టు, ముకరంజా ట్రస్టుల బాధ్యతలను కూడా అజ్మత్ జా చేపట్టనున్నారు. అజ్మత్ జా ప్రస్తుత వయస్సు 62 సంవత్సరాలు.
New Nizam of Hyderabad
9th Nizam Prince Azmath Jah Bahadur pic.twitter.com/k0OTeX6tZQ— Babaahmedhussain 74@ Gmail. com (@Babaahmedhusain) January 22, 2023