తెలంగాణ కొత్త సీఎస్ రేసులో ఉన్నదెవరు ? కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపేను?
New CS of telangana
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు అనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సి రావడంతో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొత్త సీఎస్‌గా ఎవరిని నియమించాలనే విషయంలో సీఎం కేసీఆర్ తర్జన భర్జనలు పడుతున్నారు. ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. చీఫ్ సెక్రటరీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో ఆలోచించడానికి కూడా తగిన సమయం చిక్కలేదు. సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పు రావడం, ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించడం జరిగాయి. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ రోజు సాయంత్రానికి కల్లా కొత్త సీఎస్ నియామకంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతల్లో ఉన్న పలువురు ఐఏఎస్‌లు, సీఎస్ పదవిపై ఆసక్తిని కనబరుస్తున్నారు. అందులో ఎవరికి అదృష్టం వరిస్తుందనే విషయం మరి కొన్న గంటల్లో ల. సీఎస్ రేసులో ఉన్నవాళ్లలో రామ కృష్ణ రావు, అరవింద్ కుమార్, శాంతి కుమారి పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.
మరోవైపు సోమేశ్ కుమార్ విషయంలో కూడా అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన తర్వార లాంగ్ లీవ్ పెట్టి విశ్రాంతి తీసుకుంటారని కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. రేపు సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో ఎటువంటి చర్చలు జరిగాయి, సీఎం ఆయనకు ఎటువంటి సలహా ఇచ్చారనే విషయాలు ఆసక్తిగా మారాయి.