Yuva Galam: పాదయాత్ర కు బయల్దేరిన నారా లోకేశ్
Nara Lokesh at NTR Ghat to take blessings
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 400 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. తన పర్యటనలో మొత్తం 4000 కిలోమీటర్ల దూరం నడవనున్నారు. ప్రజలతో మమేకం కానున్నారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ఈ బృహత్ కార్యక్రమానికి బయలుదేరే ముందు టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ సమాధిని దర్శించుకోనున్నారు. ఎన్టీయార్ కు నివాళులర్పించనున్నారు. ఆ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ బయలుదేరనున్నారు.
పాదయాత్ర సందర్భంగా లారాలోకేశ్ విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేష్ కోసం ప్రత్యేక కార్వాన్ సిద్ధమయింది. పాదయాత్రలో విశ్రాంతి తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్ లో అధునాతన ఏర్పాట్లు చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి కార్వాన్ ద్వారా కుప్పం బయలు దేరనున్నారు. లోకేశ్ తో పాటు పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా కుప్పం బయలుదేరనున్నారు. జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలు కానుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh గారు "యువగళం" పేరుతో కుప్పం నుండి ఇచ్ఛాపురం వరకు 27 వ తేదీ నుండి ప్రారంభమయ్యే పాదయాత్రకు పోలవరం నియోజకవర్గం తరుపున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము- బొరగం శ్రీనివాసులు, పోలవరం నియోజకవర్గం కన్వీనర్ #YuvaGalamLokesh#HOPE0138 pic.twitter.com/bkNGmmZJdS
— Boragam Srinivasulu (@boragamsrinivas) January 25, 2023
నారా లోకేష్ అన్న 4000 కి.మీ.ల యువగళం పాదయాత్రకు మద్దతుగా తన కార్ ను యువగళం సమాచారంతో అలంకరించిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి.#YuvaGalam #NaraLokesh pic.twitter.com/HfZ1x6jHuP
— TalapaReddy VeeraReddy (@tvrtdp) January 25, 2023