RGV: రాంగోపాల్ వర్మ శ్రమకు దక్కిన ఫలితం, బాలుడి కుటుంబానికి అందుతున్న సాయం
Nagarjuna University Students and Faculty members donated Rs.1,10,000 to o the family of the boy killed by the dogs
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. అంబర్ పేటలో వీధికుక్కల దాడితో చనిపోయిన బాలుడి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు. ట్విట్టర్ ద్వారా బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బాలుడికి డబ్బులు అందేలా ఓ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఆ బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించారు. రాంగోపాల్ వర్మ పిలుపుకు స్పందించిన అనేక మంది ఆ అకౌంట్ ద్వారా సాయం అందించారు. తోచినంత విరాళం అందించారు.
తాజాగా నాగార్జున యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు తమ మనసు చాటుకున్నారు. బాలుడి కుటుంబానికి అండగా నిలిచారు. లక్షా 10 వేల రూపాయలు వసూలు చేశారు. 5 వేలు, 10 వేలు రూపాయల మొత్తాన్ని బాలుడి కుటుంబానికి సాయంగా అందించారు. ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధులు చూపిన ఔదార్యాన్ని ప్రశంసించారు.
వీధి కుక్కలు దాడిలో బాలుడి మృతి
అంబర్ పేటలో ఓ నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో బాలుడు చనిపోయాడు. ఈ ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కుక్కలకు ఆకలి వేసిన కారణంగానే అవి దాడులకు పాల్పడుతున్నాయని గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు అనేక మందికి కోపం తెప్పించాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూడా ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ట్విట్టర్ వేదికగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అనేక విమర్శలు చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. న్యాయపోరాటానికి దిగారు. ఆర్ధిక సాయం అందించాలని కోరుతూ ట్వీట్ చేశారు. బాలుడి కుటుంబానికి అందేలా ఓ బ్యాంకు అకౌంట్ క్రియేట్ చేశారు.
Extremely happy to announce the kind gesture by the students and faculty members of Acharya Nagarjuna University in donating one lakh,10,000 rupees to the family of the boy killed by the dogs pic.twitter.com/R7mRBoxDtN
— Ram Gopal Varma (@RGVzoomin) March 4, 2023