Hyderabad: ట్యాంక్ బండ్లో దూకి యువతి..బిల్డింగ్ పై నుంచి దూకి బాలిక అనుమానాస్పద మృతి!
Mysterious Suicides in Hyderabad: హైదరాబాద్ లో వరుస ఆత్మహత్యలు ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఎల్బీనగర్ లో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. బిల్డింగ్ పై నుంచి కింద పడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలిక తొమ్మిది సంవత్సరాల వర్షితగా గుర్తించారు పోలీసులు. మధురానగర్లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండవ కూతురుగా గుర్తించారు. కిరాణ షాప్ కు వెళ్తున్నానంటూ తల్లికి చెప్పిన బాలిక చంద్రపురి కాలనీకి ఆటోలో వచ్చి బిల్డింగ్ పైకి వెళ్లిన బాలిక ఐదు నిమిషాల్లో బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయింది. ఆటో డ్రైవర్ ఫోన్ నుండి గుర్తుతెలియని వ్యక్తి కి ఫోన్ చేసిందని తెలుస్తోంది. అసలు ఆమె బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లింది? ఎవరికి కాల్ చేసింది? ఎలా పడిపోయింది? అని విషయం మీద చర్చ జరుగుతోంది. పాప మృతిలో పలు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.
అది హత్యా…? ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిసి పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు, ఉస్మానియా హస్పటల్ కు మృతదేహం తరలించారు. మరోపక్క ట్యాంక్ బండ్ లో దూకి శైలజ అనే యువతి ఆత్మ హత్య చేసుకుంది. చున్నీతో మెడకు బిగించుకుని ట్యాంక్ బండ్ వాటర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉన్న శైలజ ఉదయం 5 గంటలనుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ లో శవమై తేలింది. భర్త చనిపోవడం, అనారోగ్య సమస్యలతో డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నట్టు చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతూ ట్యాంక్ బండ్ లో మృతదేహాన్ని ఫ్యామిలీ గుర్తించింది. ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు.