వార్తలు ఇకపై మాటల రూపంలోనూ..
వార్తలనే మాటలుగా..మాటలే వార్తలుగా మీకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా వినిపించడానికి సరికొత్త ప్రయోగంతో వచ్చేసింది..‘మై సిటీ హైదరాబాద్ డాట్ ఇన్ ’(My City Hyderabad.in). బిజీబిజీ జీవితాలలో వార్తల గురించి తెలుసుకోవాలని అనుకున్నవారికి, అయ్యో ఆ న్యూస్ మిస్ అయ్యామే అని బాధపడేవారికి పాడ్ కాస్ట్( PODCAST) రూపంలో .. వారంలో జరిగే అన్ని విశేషాలను అందించడానికి ఈ రోజు నుంచి లాంచ్ అవుతోంది.
విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన కొద్దీ మనిషి ఆలోచనలు మారుతున్నాయి. రొటీన్ లైఫ్ లోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందులో మెయిన్ గా ప్రపంచాన్ని అరచేతిలో చూపించే వార్తలను చదవడానికి, వినడానికి, చూడటానికి రకరకలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పేపర్, టీవీ, మొబైల్ యాప్స్, వెబ్ సైట్ ఇలా ఎన్ని వచ్చినా వాటిని ఆదరిస్తూ.. విశ్వం గురించి వివరించే వివిధ వార్తలను విపులంగానే తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ‘మై సిటీ హైదరాబాద్.ఇన్ ’ (My City Hyderabad.in)ఇప్పుడు సరికొత్త ప్రయోగంతో ముందుకు వచ్చిందని సగర్వంగా చెప్పగలం.
ఎందుకంటే ఇప్పుడంటే అరచేతిలో ఇమిడే మొబైల్ లోనే నిమిషాల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాం కానీ..ఒకప్పుడు రేడియో ఉంటేనే చాలా విషయాలు తెలిసేవి. మెల్లగా టీవీలు రావడం.. తర్వాత టెక్నాలజీ పెరిగి స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్ లు అందరి జీవితాల్లోకి వచ్చేసి రేడియోను దూరం చేసేసాయి. కానీ ఇప్పటికీ ఆ ఫ్లేవర్ ఎఫ్ ఎమ్ రేడియోలు మోసుకు వస్తున్నా.. ఎంతయినా రేడియోలో వినే వార్తలు, ఆ విషయాలు, పాటలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా మారు మూల ప్రాంత వాసులకు చేర వేసే ఆ బుల్లి పరికరం పైన ఇంకా చాలామందికి మమకారమే అంటే కాదనగలమా?
అందుకే అలాంటి వారంతా కలసినప్పుడు ఎంతయినా ఆరోజులే బాగుండేవంటూ చెప్పుకున్న మాటల్లో.. రేడియో పేరు లేకుండా, ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఆ ముచ్చట్లు ముగిసిపోవంటే అది అతిశయోక్తి కాదేమో. అందుకే ఇలాంటి వారందరికీ ఇప్పుడు.. ‘మై సిటీ హైదరాబాద్ డాట్ ఇన్’బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ తో పాటు వారం రోజుల నుంచి మిస్ అయ్యే వార్తలను వినిపించడానికి పాడ్ కాస్ట్ తో లాంచ్ అయిపోయింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఏపీ నుంచి యూఎస్ దాకా, సైన్స్, టెక్నాలజీ, మాస్ మసాలా ఎంటర్ టైన్ మెంట్, కిక్కిచ్చే వైరల్ వార్తలు, ఇలా వారంలో జరిగిన ఏ విషయాన్ని మిస్ చేయకుండా మీకు అందిస్తాం. అంతేకాదు వీకెండ్ విశేషాలు, వీక్ డేస్ వార్తలు ఏ ఒక్కటీ మిస్ కాకుండా మీకు అందించడానికి మేం రెడీ.. మరి వినడానికి మీరు రెడీనా??
ఈ క్రింది లింక్స్ ద్వారా వార్తలు వినండి.. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.
https://www.stitcher.com/show/1069216
https://www.pandora.com/podcast/my-city-hyderabad-news-podcast/PC:1001069216