మునుగోడు ఉప ఎన్నిక కాసేపట్లో ప్రారంభం కానున్నది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది. దీనికోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 2 వేల మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. సుమారు 2 వేల మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించి ఆ స్టేషన్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక ముగియడానికి ఇంకాస్త సమయం పడుతుందని ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత క్యులైన్ లో చాలా మంది ఉన్నారని, వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల చిన్న గొడవలు జరిగాయని, 6100 లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు.
మునుగోడులో ముగింపు దశకు చేరుకుంటున్న పోలింగ్
మరికాసేపట్లో ముగియనున్న పోలింగ్
సాయంత్రం 6 గంటల సమయానికి లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే ఛాన్స్
సాయంత్రం 5 గంటల వరకు 77.55 % పోలింగ్ నమోదు
మునుగోడులో మొత్తం ఓట్లు 2,41,805
సాయంత్రం 5 వరకు ఓటు వేసిన 1,87, 527 మంది
ఇంకా 53 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది.
Approximate Voter Turnout around 5PM is around 77.55%* at AC - #Munugode
* This is approximate trend as data from some polling station takes time. Final data for each PS is shared in FORM 17C with all polling agents#MunugodeBypolls #ByeElection2022 @ECISVEEP pic.twitter.com/M7KQTWq29R
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
మునుగోడు పోలింగ్ సమయం మరో గంట సేపట్లో ముగియనుంది. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఉదయం వేళలో రకరకాల పనులతో బిజీగా ఉన్న కొందరు ఓటర్లు ప్రస్తుతం తీరిక చేసుకుని తమ తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి వెళుతున్నారు.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్‌కు బీజేపీపై ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ,విచ్చల విడిగా డబ్బు, మధ్యం పంపిణీ చేస్తున్నారని వికాస్ రాజ్‌కు వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మునుగోడులో చౌటుప్పల్‌లో విపరీతంగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్యంను బీజేపీ ఖూని చేస్తోందని, మతోన్మద బీజేపీ మత, కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ పైసలు పంచుకుంటు మా పై ఆరోపణ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేస్తున్నారు. గంగోరిగూడెంకి చెందిన అనేక మంది వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Setting an instance, these PwD voters cast their votes at Gangorigudem PS 127#MunugodeBypolls #Munugode #ByeElection2022 #NoVoterTobeleftBehind #EveryVoteCounts #CEOTelangana #munugodebyelection pic.twitter.com/Hc2g3Qngfb
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
మునుగోడులో ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 59.92శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మునుగోడులో మొత్తం 2 లక్షల 41 వేల 805 మంది ఓటర్లు ఉండగా, అందులో ఒక లక్షా 44 వేల 878 మంది మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరో 3 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. 80 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Approximate Voter Turnout around 3PM is around 59.92%* at AC - #Munugode
* This is approximate trend as data from some polling station takes time. Final data for each PS is shared in FORM 17C with all polling agents#MunugodeBypolls #ByeElection2022 @ECISVEEP
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 41.30 శాతం పోలింగ్ నమోదయింది. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగనుంది.
Approximate Voter Turnout around 1 PM is around 41.30%* at AC - #Munugode
* This is approximate trend as data from some polling station takes time. Final data for each PS is shared in FORM 17C with all polling agents#MunugodeBypolls #ByeElection2022 @ECISVEEP pic.twitter.com/dqhmBH0csq
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది
ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు
మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ
ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపాం
ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ ఊపందుకుంది
మధ్నాహ్నం ఒంటి గంట వరకు 41.30 శాతం పోలింగ్ నమోదైంది
స్వల్ప అంతరాయాలు మినహా పోలింగ్ ప్రశాంతం
ఎన్నికల అధికారులు నిఘా మధ్య కొనాసాగున్న పోలింగ్
మునుగోడులో వయసు పైబడిన ఓటర్లు చాలా మందే ఉన్నారు. వారిలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. తమ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఫైజల్ ఖాన్ అనే ఓ వ్యక్తి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా మునుగోడులో ఎంత మంది ఓటర్లు ఉన్నారనే విషయంతో పాటు 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని కూడా తెలిపాడు. ఆ ఎక్క ప్రకారం 2576 మంది 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారు. అందులో పురుషలు సంఖ్య 984 కాగా, స్త్రీల సంఖ్య 1592గా ఉంది.
Electors strength of #MunugodeBypoll #MunugodeWithTRS #Munugodu pic.twitter.com/fRr0d3wY1s
— Faisal Khan 🇮🇳 (@faisalkhanhyd) November 3, 2022
మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయి. చిన్నకొండూరు గ్రామంలో కొంత సేపు ఈవీఎంలు పనిచేయకపోవడంతో గ్రామస్థులు నిరాశ చెందారు. నిలబడే ఓపిక లేక అక్కడే కొంతసేపటి వరకు కూర్చిండిపోయారు. ఈవీఎంలు తిరిగి పనిచేయడం ప్రారంభం కావడంతో తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Due to technical problem in EVMs at Chinnakonduru village of #Munugode , polling breaks for some time, Voters sit on the floor and wait to cast their votes.#Telangana #BJP #TRS #Congress #munugodubyelections #Munugodu pic.twitter.com/6TIw2xi6JG
— Surya Reddy (@jsuryareddy) November 3, 2022
తెలంగాణలో చాలా మంది ఎమ్మెల్యేలు గత నెలలో మునుగోడులో ప్రచారానికే ఎక్కువ సమయం కేటాయించారు. వీరందరికీ అక్టోబర్ నెల జీతం ఇవ్వవద్దని ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా కోరాడు. నో వర్క్ నో పే విధానం వీళ్లకు కూడా వర్తింప జేయాలని కోరాడు.
Pls don't give MLAs their salary for the month of October @TelanganaCMO @TelanganaCS all the MLA's gone to work in munugodu only! #NoworkNopay rule should apply to political leaders too! Should bring a new rule that Every political leader needs to show their tour diary for
— īnf!ñ8 (@KSKumar_8) November 3, 2022
6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 7 చోట్లా పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీహార్‌లో ఓటర్ల చైతన్యం ఎక్కువుగా ఉన్నట్లు కనిపించింది. ఉదయం 11 గంటల సమయానికి బీహార్‌లోని మోకమా నియోజకవర్గంలో 27.03 శాతం పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో మునుగోడు నిలిచింది. మునుగోడులో ఉదయం 11 గంటల సమయానికి 25.80 శాతం పోలింగ్ నమోదయింది. మిగతా చోట్ల ఓటింగ్ సరళి నెమ్మదిగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
25.80% Voter turn out at 11 am.
Interestingly Munugodu is leading in 2nd place of Bye-Elections in 6 states. pic.twitter.com/IrqeQ5tbDR
— Robin Zaccheus (@RobinZaccheus) November 3, 2022
మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఒకటి రెండు చెదురు మదురు ఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలందరూ తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కూడా మునుగోడు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఇలాగే ఒక పోలింగ్ కేంద్రాని పరిశీలించి బయటకు వచ్చిన పాల్ ఒక్కసారిగా పరుగు పెట్టారు. దీంతో ఏమయిందోనని అందరూ కంగారు పడ్డారు. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకే పరుగులు తీస్తున్నట్లు తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
#KAPaul also running in the #Munugodu race to become an MLA. Quite literally- running. #MunugodeBypoll #Telangana pic.twitter.com/1OIX6AP2Nr
— Rishika Sadam (@RishikaSadam) November 3, 2022
మునుగోడులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 వరకు మొత్తం 25.8 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోలీంగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
I urge the people of Munugode to come out in large numbers and exercise their right to vote, to ensure good governance, able leadership & to be represented by a leader who is always available for the constituents.
Your vote today will redefine Telangana’s Future.
— G Kishan Reddy (@kishanreddybjp) November 3, 2022
మునుగోడు ఎన్నికల ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా తెలంగాణ ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఈ పర్యవేక్షణకు ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
Munugode Bye election voting process is being monitored by the CEO team through webcasting.#MunugodeBypolls #Munugode #ByeElection2022 #NoVoterTobeleftBehind #EveryVoteCounts #CEOTelangana #munugodebyelection pic.twitter.com/6DMDEnoIhM
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
మునుగోడు ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ నాయకులు మర్రిగూడ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళన కారులను అక్కడి నుంచి తరిమి వేశారు. ఉప ఎన్నిక సజావుగా సాగేలా చూస్తున్నారు.
Lathi charge on #BJP followers at a polling station in Marriguda, #Munugodu. #BJP supporters staged a protest at a polling station in Marriguda, demanding action on the leaders from #TRS party who are allegedly trying to influence voters.Police lathi charged & dispersed the crowd pic.twitter.com/NIK71GBmsS
— Sowmith Yakkati (@sowmith7) November 3, 2022
దేశంలో 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలే ప్రధానంగా బీజేపీకి పోటీగా నిలిచాయి.
(1)మహారాష్ట్రలో అంధేరీ ఈస్ట్
(2)(3)బీహార్‌లో గోపాల్ గంజ్, మొకమా స్థానాలు
(4)హర్యానాలో ఆదంపూర్
(5)యూపీలో గోల గోకరన్నాథ్ స్థానం
(6)ఒడిషాలో ధామ్‌నగర్
(7)తెలంగాణలో మునుగోడు
ఈ రోజు ఉప ఎన్నిక జరిగిన అన్ని స్థానాలలోను నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. విజేతలు ఎవరో తేలనుంది.
నారాయణ్‌పుర్ మండలంలోని సుర్వేల్ పోలింగ్ కేంద్రం కేవలం మహిళల కోసమే కేటాయించారు. శక్తి ఓటింగ్ కేంద్రం అని పిలవబడే ఈ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకురాలు ముల్లమూడి సమత పర్యవేక్షించారు. అక్కడకు వచ్చిన ఓటర్లను పలకరించారు.
Glimpses from #WomenPollingStation76#MunugodeBypolls #Munugode #ByeElection2022 #NoVoterTobeleftBehind #EveryVoteCounts pic.twitter.com/ClJedYTnym
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
Expenditure Observer Samatha Mullamudi visited Sakhi(all women) poling station at #Survel in Narayanpur Mandal.Greeted the first voter and apriciated the team.#MunugodeBypolls #Munugode #ByeElection2022 #NoVoterTobeleftBehind #EveryVoteCounts pic.twitter.com/9vqoVYEfby
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
మునుగోడు ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి ప్రజలు బారులు తీరారు. వయసు మీరిన వారు సైతం పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. స్థానికుల సాయంతో కొందరు, ఎన్నికల సిబ్బంది సాయంతో కొందరు తమ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేయడానికి వయసు అడ్డుకాదని స్పష్టం చేస్తున్నారు. ఓటు వేసే అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా వస్తున్నారు.
Old age no barrier for casting vote. An elderly voter aged above 80 being accompanied to the polling booth on a wheel chair#MunugodeBypolls #Munugode #ByeElection2022 #NoVoterTobeleftBehind #EveryVoteCounts pic.twitter.com/lnNmbxMDDS
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఈ రెండు గంటల్లో 11.20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది.
Approximate Voter Turnout around 9 am is around 11.20%* at AC - #Munugode
* This is approximate trend as data from some polling station takes time. Final data for each PS is shared in FORM 17C with all polling agents#MunugodeBypolls #CEOTelangana #ByeElection2022
— CEO Telangana (@CEO_Telangana) November 3, 2022
మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండలంలోని తన స్వగ్రామమైన లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.
మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండలంలోని తన స్వగ్రామమైన లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. pic.twitter.com/CTT8aY55ng
— TRS Party (@trspartyonline) November 3, 2022
మునుగోడులో ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఓటర్లు తాము ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పోలింగ్ బూత్ బయటకు వచ్చి తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియోలో పోస్టు చేస్తున్నారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ యే బలమైనదని చెబుతున్నారు.
Ballot is stronger than Bullet
Someone struggled for your right to vote. Use it.. pic.twitter.com/PIeRAixkh8
— Jagan Patimeedi (@JAGANTRS) November 3, 2022
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న బండి సంజయ్
మునుగోడులో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్
టీఆర్ఎస్ దాడులకు, ప్రలోభాలకు వెరవకుండా పోలింగ్ సజావుగా సాగేలా చూడాలని కోరిన బండి సంజయ్
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని కోరిన బండి సంజయ్
ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదు
పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరిన ఓటర్లు
క్రమేణా పోలింగ్ కేంద్రాల వద్ద పెరుగుతున్న ఓటర్ల క్యూ
సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
స్థానికేతరులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారన్న బీజేపీ శ్రేణులు
ఔటర్స్ ని ఎందుకు అనుమతి ఇస్తున్నారంటూ ఆందోళన
తక్షణమే బయటి వ్యక్తులను పంపించివేయాలని డిమాండ్
298 పొలింగ్ స్టేషన్లలో ప్రశాoతంగా పోలింగ్ జరుగుతుంది
నిన్న జరిగిన ఘటనల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
నాన్ లోకల్ వాళ్ళు ఇంకా మునుగోడు లో ఉన్నారని పిర్యాదు అందింది
రెండు గ్రామాల్లో ఎన్నికల సిబ్బంది డబ్బులు, కొన్ని వస్తువులు పట్టుకున్నారు.
2 పొలింగ్ స్టేషన్ లలో ఈవీఎం బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది సెట్ చేశాము
ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ పరిస్థితులు గమనిస్తున్నాము
మునుగోడు ఉప ఎన్నిక తీరుపై ఎన్నికల సంఘం నిఘా
ప్రతీ పోలింగ్ కేంద్రం పరిశీలిస్తున్న ఎన్నికల అబ్జర్వర్లు
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలీన
ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
మునుగోడు బరిలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు హక్కు వినియోగం
సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని లింగ వారి గూడెం లో ఓటు వేసిన ప్రభాకర్ రెడ్డి
గ్రామాల్లో ఉదయమే ఓటర్లు పోలింగ్ సెంటర్లకు వచ్చారు
తొలి గంటలోనే గ్రామాల్లో భారీగా పోలింగ్ నమోదైంది
వృద్ధులు,మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు
కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్ లో పట్టివేత.
వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్ లో ఉన్నారని ఫిర్యాదు
సామాగ్రి మరియు డబ్బులు పట్టుకున్న అబ్జర్వర్ సమత
భారీ కాన్వాయ్ తో బయల్దేరిన బండి సంజయ్
నియోజకవర్గంలో ఉన్న ఇతర నేతలను పంపాలని డిమాండ్
అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ లో బండి సంజయ్
స్టేషన్ వద్దకు భారీగా బీజేపీ కార్యకర్తలు
నియోజకవర్గ వ్యాప్తంగా మొదలైన పోలింగ్
బరిలో నిలిచిన 47 మంది అభ్యర్ధులు
మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్