మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి నవంబర్ 3 వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో రాత్రి 10:30 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి నవంబర్ 3 వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో రాత్రి 10:30 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు మునుగోడు ఫలితం తేలనున్నది. ఎగ్జిట్ ఫలితాలు కారుకు అనుకూలంగా ఉండటంతో, ఆ ఫలితాలు నిజమౌతాయా లేదంటే తలక్రిందులౌతాయా అన్నది కాసేపట్లో తేలిపోతుంది.
మునుగోడు కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా 14 రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ జోరు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 10,094 ఓట్ల ఆధిక్యంలో కారు పార్టీ కొనసాగుతోంది. ఇంకా మరొక్క రౌండ్ లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. ఆ రౌండ్ కూడా పూర్తయితే టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం మెజార్టీ ఎంత అనేది వెల్లడికానుంది. ఈలోగా టీఆర్ఎస్ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
మునుగోడు కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. 13 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 13 రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ జోరు మరింత పెరిగింది. 9039 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 1/6 వ వంతు ఓట్లు కూడా దక్కలేదు. 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 16,280 ఓట్లు మాత్రమే లభించాయి.
మునుగోడు ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్ధి రాజ్‌గోపాల్ రెడ్డి స్పందించారు.కమ్యూనిస్టుల ఓట్లు టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చాయని అన్నారు. కేసీఆర్ అవినీతి సొమ్ముకు మునుగోడులో వామపక్ష పార్టీల నేతలు అమ్ముడుపోయారని రాజ్‌గోపాల్ రెడ్డి ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. 11 రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇప్పటి వరకు 5800 ఓట్ల తేడాతో కారు జోరు కొనసాగుతోంది. దీంతో బీజేపీ అభ్యర్ధి రాజ్‌గోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఫలితాలు తమకు అనకూలంగా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అక్కడి నుంచి నిష్క్రమించారు.
చండూర్, గట్టుప్పల్ మండలాల్లో కూడా కారు జోరు కొనసాగింది. అక్కడి ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీవైపే మొగ్గు చూపారు. కారు గుర్తుకే ఎక్కువ మంది ఓటు వేసినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 11 రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 5800 ఓట్ల తేడాతో కారు జోరు కొనసాగుతోంది.
మునుగోడు కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 11 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. 11 రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 5800 ఓట్ల తేడాతో కారు జోరు కొనసాగుతోంది.
10 రౌండ్ల తర్వాత కూడా టీఆర్‌ఎస్ జోరు కొనసాగడంతో గెలుపు ఎవరిదనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. దీంతో తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు తినిపించుకుంటున్నారు. బాణాసంచా కాల్చుతూ, డాన్సులు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
10వ రౌండ్ తర్వాత కూడా టీఆర్‌ఎస్ జోరు తగ్గలేదు. మరింత ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. దాదాపుగా ప్రతి రౌండ్‌లోను టీఆర్‌ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 9 రౌండ్లు పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం 3925 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ 10వ రౌండ్ తర్వాత మరింత ఆధిక్యంలోకి చేరింది.
#Munugode counting updates:
10th round: TRS leads#MunugoduBypoll #Munugodu #munugoderesult #MunugodeBypoll
— NVK (@nvkrishna26) November 6, 2022
మునుగోడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా 9 రౌండ్లు పూర్తయ్యాయి. దాదాపుగా ప్రతి రౌండ్‌లోను టీఆర్‌ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదట్లో రెండు మూడు రౌండ్లు మినహా తర్వాత జరిగిన కౌంటింగ్‌లో కారు జోరు కొనసాగుతోంది. 9 రౌండ్లు పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం 3925 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మరో 6 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికాసేపట్లో వాటి ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
9,10..రౌండ్‌లలో పూర్తిగా చండురు ఓట్లు లెక్కించనున్నారు. చండూర్ గట్టుప్పల్‌లో చేనేతల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. వీళ్లలో ఎక్కువ మంది ఈ సారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపారనే విషయం మరికాసేపట్లో తేలనుంది. చేనేతలు ఎవరి వైపు అనే విషయంలో క్లారిటీ రానుంది.
మునుగోడు ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8 రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్ ఆధిక్యం 3285కి చేరింది. 7 రౌండ్ల తర్వాత 2555 ఉన్న టీఆర్‌ఎస్ ఆధిక్యం 3285కి పెరిగింది.
మునుగోడు ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా 7 రౌండ్లు పూర్తయ్యాయి. 7 రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్ ఆధిక్యం 2555కి చేరింది. 7వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 7189 ఓట్లు రాగా, బీజేపీకి 6803 ఓట్లు లభించాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 386 ఓట్ల లీడ్ సాధించింది. 6వ రౌండ్ వరకు 2162 ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీఆర్‌ఎస్ 7వ రౌండ్ తర్వాత 2555 ఆధిక్యంలోకి వెళ్లింది.
మునుగోడు కౌంటింగ్ ప్రక్రియపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి విషయంలో తాజాగా మరోబీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంట వెంటనే ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మొదటి నాలుగు రౌండ్స్ లో 47 మందే అభ్యర్థులు ఉన్నారు, ఐదో రౌండ్‌లో కూడా 47 మంది అభ్యర్థులే ఉన్నారు. 5వ రౌండ్ ఫలితాల విడుదలలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 రౌండ్లు పూర్తయ్యాయి. ఆరు రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్ ఆధిక్యం 2162కి చేరింది. 5వ రౌండ్ తర్వాత 1531 ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీఆర్‌ఎస్ 6వ రౌండ్ తర్వాత 2162 ఆధిక్యంలోకి వచ్చింది. 4,5,6వ రౌండ్లలో నారాయణ పురం మండలంలోని ఓట్లని లెక్కించారు. ఇక్కడి ఓటర్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటు వేసినట్లు ఫలితాలను బట్టి స్పష్టమౌతోంది.
#Munugode counting updates:
6th round: TRS leads#MunugoduBypoll #Munugodu #munugoderesult #MunugodeBypoll
— NVK (@nvkrishna26) November 6, 2022
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించారు. పొరపాటు జరిగితే అది మీకే మచ్చ అని తెలిపారు. మునుగోడులో జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ అంతా ఎన్నికల కమిషన్ మీద రాంగ్ ఒపీనియన్ వచ్చిందని, ఫలితాలు సక్రమంగా వెల్లడించండని కోరారు. గెలుపు, ఓటములు సహజమే కానీ మీ మీద మచ్చ తెచ్చుకోకుండా చూసుకోండని వికాస్ రాజ్‌కి ఈటల రాజేందర్ సూచించారు.
5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్ ఆధిక్యం 1531కి చేరింది. 5వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి మొత్తం 6062 ఓట్లు రాగా, బీజేపీకి 5245 ఓట్లు లభించాయి.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యం పై టిఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం అవడం పై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంతో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్ అవుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్‌తో సీఈఓ వికాస్ రాజ్ అలర్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్‌లోడ్ చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి @kishanreddybjp ఫోన్
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం
ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని CEOను ప్రశ్నించిన కేంద్రమంత్రి
మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేసిన CEO
— BJP Telangana (@BJP4Telangana) November 6, 2022
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వైఖరిపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో CEO వైఖరి అనుమానాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని సీఈవోపై బండి సంజయ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ ప్రశ్నించారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని సందేహం వ్యక్తం చేశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
చౌటుప్పల్ పైనే తొలి నుంచి రాజగోపాల్ ఆశలు
చౌటుప్పల్ లో బీజేపీ ఆశలు గల్లంతు
నాలుగు రౌండ్లు పూర్తయిన తరువాత టీఆర్ఎస్ ఆధిక్యత
చౌటుప్పల్ లో అనూహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్
చుండూరు ..మర్రిగూడ మండలాల్లో ఆధిపత్యం సాధించే పార్టీకి విజయావకాశాలు
చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు
ఇప్పటివరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉంది
రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి
చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు
బిజెపి గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది.
నాలుగో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ కు 26343 ఓట్లు
బీజేపీకి 25730 ఓట్లు పోలయ్యాయి
కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతికి 8200 ఓట్లు దక్కాయి
ఇప్పటి వరకు టీఆర్ఎస్ 613 ఓట్ల మెజార్టీతో ఉంది
నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ కు 4854 ఓట్లు
బీజేపీకి 4555 ఓట్లు పోలయ్యాయి
ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1,034 ఆధిక్యత దక్కింది
నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యతలో ఉంది.
టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లింగవాని గూడెం లో బీజేపీ ఆధిక్యత
తొలి రౌండ్ లో టీఆర్ఎస్ లీడ్
వరుసగా 2,3,4 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత
నాలుగో రౌండ్ లో బీజేపీకి దాదాపు రెండు వేల ఓట్ల ఆధిక్యత
మొదటి రెండు రౌండ్లు పూర్తైన తరువాత కాంగ్రెస్ పార్టీ మూడు వేలకు పైగా ఓట్లు సాధించింది. అయితే, రెండు రౌండ్లు పూర్తయిన తరువాత కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు.
చౌటుప్పల్- నారాయణ్ పూర్ లో నాలుగో రౌండ్ కౌంటింగ్
తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు మెజార్టీ
రెండు..మూడు..నాలుగో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
మంత్రి శ్రీవాస్ గౌడ్ ఇంచార్జ్ ఉన్నా లింగోజిగుడెం గ్రామంలో 400 లీడ్ సంపాదించిన బీజేపీ
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ కు మొదటి రౌండ్ లో 104, గాలయ్య చెప్పుల గుర్తు 157 ఓట్లు కేఏ పాల్ ఉంగరం గుర్తు 34 ఓట్లు, రోడ్ రోలర్ గుర్తు శివకుమార్ 84 ఓట్లు సాధించారు.
టీఆర్ఎస్ కు 7010 ఓట్లు వచ్చాయి
బిజేపికి 7426 ఓట్లు పోలయ్యాయి
కాంగ్రెస్ కు 1532 దక్కాయి.
ఈ రౌండ్ లో బీజేపీకి 416 ఓట్ల మెజార్టీ దక్కింది.
మూడు రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 35 ఓట్ల లీడ్ లో ఉంది.
రౌండ్ రౌండ్ కు ట్రెండ్ మారుతుండటం తో బెట్టింగ్ బంగార్రాజుల్లో టెంషన్ టెంషన్
టీఆర్ఎస్ కు 7781 ఓట్లు పోలయ్యాయి
బీజేపీకి ఈ రౌండ్ లో 8622 ఓట్లు వచ్చాయి
కాంగ్రెస్ కు1532 ఓట్లు దక్కాయి.
తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 1352 ఓట్లు మెజార్టీ
రెండో రౌండ్ ముగిసే సరికి 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
చౌటుప్పల్ అర్బన్ లో ఓట్ల లెక్కింపు
తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 1352 ఓట్ల మెజార్టీ
రెండో రౌండ్ లో 789 ఓట్ల ఆధిక్యత సాధించిన బీజేపీ
టీఆర్ఎస్ మెజార్టీని 563కి తగ్గించిన బీజేపీ
తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6096
బిజేపి 4904 ఓట్లు
కాంగ్రెస్ కు 1877 ఓట్లు పోలయ్యాయి
తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 1192 ఓట్ల ఆధిక్యత దక్కింది
చౌటుప్పల్ మండలంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం
1192 ఓట్ల ఆధిక్యత సాధించిన టీఆర్ఎస్
ఈ మండలంలో ఆశలు పెట్టుకున్న బీజేపీ
పోస్టల్ బ్యాలెట్ లోనే హోరా హోరీ
టీఆర్ఎస్ - బీజేపీ మధ్య నాలుగు ఓట్ల తేడా
నాలుగు ఓట్ల ఆధిక్యతలో టీఆర్ఎస్
కాంగ్రెస్ కు 88 ఓట్లు
బీఎస్పీ 10
టిఆర్ఎస్ 228
బిజెపి 224
కాంగ్రెస్ 88
పోస్టల్ బ్యాలెట్ లో పోలయిన 686 ఓట్లు
టీఆర్ఎస్ కు 228 ఓట్లు
బీజేపీకి 224 ఓట్లు
బీఎస్పీకి 10 ఓట్లు
కౌంటింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డి
ప్రజల ఆశీర్వాదం టీఆర్ఎస్ కు ఉంది
భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుంది
తొలి నాలుగు రౌండ్లు చౌటుప్పల్ ఓట్ల లెక్కింపు
చౌటుప్పల్ మండలంలో 55,678 ఓట్లు పోలయ్యాయి
ఇదే మండలంపైన బీజేపీ ఆశలు
బీజేపీ దెబ్బ తీసేలా ఇక్కడే ఫోకస్ చేసిన టీఆర్ఎస్
తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ లు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు మొదలు
మొదటి 3 రౌండ్లలో చౌటుప్పల్ ఓట్ల లెక్కింపు
4,5,6 రౌండ్లలో నారాయణ్ పూర్ మండలం
6,7,8 రౌండ్లలో మునుగోడు ఓట్ల కౌంటింగ్
10,11,12 రౌండ్లలో గట్టుప్పల్ మండల ఓట్ల లెక్కింపు
13,14,15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్ల కౌంటింగ్
93 శాతం పోలింగ్ జరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేకతే
సైలెంట్ ఓటింగ్ జరిగింది
ఎవరు గెలిచినా అయిదు వేల ఓట్ల మెజార్టీ ఉంటుంది
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా బీజేపీ గెలుపు వాస్తవం
ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
21 టేబుల్స్ లో లెక్కింపు
15 రౌండ్లు జరగనున్న కౌంటింగ్