Mukarram Jha death: హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముఖరంజా అకాల మృతి
Mukarram Jha death in Turkey, mortal remains to be taken to Hyderabad on January 17
హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముఖరంజా అకాల మృతి చెందారు. ఇస్తాంబుల్ లో నిన్న రాత్రి పదిన్నర గంటలకి ముఖరం జా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జనవరి 17వ తేదీన ముఖరం జా మృతి దేహాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకురానున్నారు. ప్రజల సందర్శనార్ధం చౌ మహల్లా ప్యాలెస్ లో ముఖరంజా మృతదేహాన్ని ఉంచనున్నారు.
7వ నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1954లో తన వారసుడిని ముఖరంజాని ప్రకటించారు. 1954 నుంచి ముఖరంజా 8వ నవాబుగా ఖ్యాతా గాంచారు. 1971 వరకు ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలవబడుతూ వచ్చారు. 1971లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాజ్యాలు, పదవులు, బిరుదులు రద్దయ్యాయి.
ముఖరంజా అసలు పేరు బర్కత్ అలీ ఖాన్. చాలా ఏళ్లుగా టర్కీలోని ఇస్తాంబుల్ లో నివాసం ఉంటున్నారు. ముఖరంజా ఐదుగురిని వివాహం చేసుకున్నారు. వారిలో ముగ్గురు టర్కీకి చెందిన వారే కావడం విశేషం. మొదటి భార్య ఎస్రా బిర్గిన్ తో ఒక కొడుకు, ఒక కుమార్తెను కన్నారు.
ముఖరంజా 1959లో టర్కీకి చెందిన ఎస్రా బిర్గిన్ ను వివాహం చేసుకున్నారు. 1979 వరకు ఆమెతో ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆస్ట్రేలియా పయనమయ్యారు. 1979లో హెలెన్ సిమ్మన్స్ అనే ఓ మాజీ ఎయిర్ హోస్టెస్ ను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె బీబీసీ సంస్థలో పనిచేస్తున్నారు. వివాహం తర్వాత ఆమె తన పేరును ఆయేషాగా మార్చుకున్నారు. 1989 వరకు ముఖరంజాతోనే ఉన్నారు. 1989లో చనిపోయారు.
1992లో ముఖరంజా మూడో పెళ్లి చేసుకున్నారు. మాజీ మిస్ టర్కీ మనోల్యా ఒనర్ ను వివాహమాడారు. అదే ఏడాది మొరక్కోకు చెందిన జమీలా బొలారస్ ను పెళ్లాడారు. 1994లో టర్కీకి చెందిన ఆయేషాను వివాహం చేసుకున్నారు.