ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డి లాయర్, సునీతారెడ్డి లాయర్ల వాదనను విన్న తెలంగాణ హైకోర్టు రేపు సీబీఐ వాదనలు విననుంది
MP Avinash reddy bail Petition postponed to tomorrow
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు విచారణను శనివారానికి వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డి లాయర్, సునీతారెడ్డి లాయర్ల వాదనను విన్న తెలంగాణ హైకోర్టు రేపు సీబీఐ వాదనలు విననుంది. సీబీఐ వాదనలు విన్న తర్వాతనే తన తీర్పు వెలువరించనుంది.
సునీత న్యాయవాదిపై జడ్జి అసహనం
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర ఘనట చోటుచేసుకుంది. అవినాశ్ రెడ్డి లాయర్ తన వాదనలు వినిపించిన తర్వాత, సునీతారెడ్డి లాయర్ తన వాదనలు వినిపించేందకు సిద్ధమయ్యారు.ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జడ్జికి కోపం తెప్పించాయి. అవినాశ్ రెడ్డి లాయర్‌కు ఎంత సమయం కేటాయించారో తనకు అంతే సమయం కేటాయించాలని సునీతారెడ్డి లాయర్ డిమాండ్ చేశారు. దీంతో జడ్జి అసహనానికి గురయ్యారు. లిమిట్స్ లో ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్లో ఏముంది – హైకోర్టు
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పలు అంశాలను ప్రస్తావించింది. సీబీఐ అధికారులను కొన్ని ప్రశ్నలు వేసింది. వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ రికార్డు చేశారా అని ప్రశ్నించింది. వాచ్మెన్ రంగన్న ఏం చెప్పాడని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ పోలీసులకు రంగన్న ఇచ్చిన స్టేట్మెంచ్ చాలా కీలకమని హైకోర్టు అభిప్రాయపడింది
వ్యక్తిగత కక్ష్యతోనే హత్య చేశారు – అవినాశ్ న్యాయవాదులు
వివేకా హత్యకు అవినాశ్‌కు సంబంధం లేదని, వ్యక్తిగత కక్ష్యలతోనే వివేకాను హత్య చేశారని అవినాశ్ లాయర్ హైకోర్టు బెంచ్
ముందు వాదనలు వినిపించారు. భూతగాదాలు, అక్రమ సంబంధాలే ఈ హత్యకు కారణమని అవినాశ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గుండెపోటు అనేది అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం మాత్రమేనని, గుండెపోటు ఆధారంగా దర్యాప్తు జరగలేదని, ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని అవినాశ్ న్యాయవాది వాదించారు.
సీబీఐ వేసిన కౌంటర్‌ను అవినాష్ లాయర్ తప్పుపట్టారు. అవినాష్ నిందితుడని సీబీఐ రికార్డుల్లో ఎక్కడా చెప్పలేదన్నారు. గుండెపోటు అని చెప్పినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని అన్నారు. అవినాష్ పోలీసో, డాక్టరో కాదు కాదా? అని లాయర్ ఉమా మహేశ్వరరావు వాదించారు.