Bandi Sanjay: కవితపై బండి సంజయ్ వాఖ్యలను సమర్ధించను – అరవింద్
MP Arvind finds fault with bandi Sanjay Comments on kavitha
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుబట్టారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని స్పష్టం చేశారు. బండి సంజయ్ తన వాఖ్యలను ఉపసంహరించు కోవాలని అర్వింద్ కోరారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని, సంజయ్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అర్వింద్ స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి అనేది పవన్ సెంటర్ కాదని..అదొక కో ఆర్డినేషన్ సెంటర్ అని అర్వింద్ అన్నారు. ఆయన వాఖ్యలకు ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారని అర్వింద్ స్పష్టత ఇచ్చారు.
సహకరించకపోతే త్వరగా అరెస్టు చేస్తారు
ఈడి విచారణలో కవిత సహకరించ లేదని సమాచారం అందిందని ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఎందుకు ఏమిటి ఎలా అని ఈడి ప్రశ్నిస్తే… ఏమో తెలియదు గుర్తు లేదు అని చెప్పిందట అని అర్వింద్ విమర్శించారు. ఈడి విచారణకు సహకరించక పోతే, తొందరగా అరెస్ట్ చేస్తారని అర్వింద్ జోస్యం చెప్పారు.
తెలంగాణలో పెరుగుతున్న నేరాలు
తెలంగాణలో నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయని అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై తెలంగాణలో క్రైం పెరిగి పోయిందని కూడా అర్వింద్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలను తగ్గించడానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపించాలని అర్వింద్ కోరారు.