MLC Kavitha: సీబీఐకు మరోలేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha wrote one more letter to CBI
ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. సీబీఐ కోరినట్లుగా తాను రేపు విచారణకు హాజరు కాలేనని తెలిపారు. సీబీఐ తన వెబ్ సైట్‌లో పొందుపరిచిన FIRని తాను క్షుణ్ణంగా పరిశీలించానని, అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశానని, దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నానని కవిత తెలిపారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల 6న సమావేశం కాలేనని కవిత సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు.
ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని నా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని సీబీఐకి తెలిపారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, దర్యాప్తుకు సహకరిస్తానని కవిత తెలిపారు.
జగిత్యాలలో భారీ బహిరంగ సభలో రేపు కవిత పాల్గోనున్నారు. షెడ్యూల్ ముందే ఫిక్స్ అయి ఉన్నందున ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో సీబీఐ విచారణ వాయిదా వేయాలని కోరారు.
ఇటీవలే కవిత సీబీఐకి ఓ లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన FIR కాపీను కూడా తనకు అందించాలని లేఖలో కోరారు. కవిత లేఖకు స్పందించిన సీబీఐ అధికారులు ఆమెకు వివరాలను ఈ మెయిల్ చేశారు. FIR కాపీ సీబీఐ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు. ఈ వివరాలను పరిశీలించిన కవిత తాజాగా స్పందించారు. మరో లేఖ రాశారు.
#TRS MLC @RaoKavitha replies to #CBI says her name does not figure in any manner.
K Kavitha stated that she will be able to meet the officials on 11th, 12th or 14th, 15th of this month. pic.twitter.com/D0sobonIQo
— Aneri Shah (@tweet_aneri) December 5, 2022