Kite Festival: పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ మంత్రి తలసాని సందడి
Minister Talasani Srinivas Yadav Participates in Kite Festival in Hyderabad
హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. నగరం నలు మూలల నుంచి వచ్చిన ఉత్సాహవంతులు ఎంతో సరదాగా పతంగులు ఎగురవేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. సరదాగా కాసేపు పతంగులు ఎగురవేశారు.
కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని ఈ సందర్భంగా తలసాని అన్నారు. తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉందని, పాశ్చాత్య మోజులో పండగ సంస్కృతి మరిచిపోతున్నారని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. మన పండగల గురించి, సంప్రదాయాల గురించి పిల్లలకు తల్లిదండ్రేలే చెప్పాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. చిన్నప్పుడు మేమే మంజాలు తయారు చేసుకునే వాళ్ళమని, ప్రస్తుతం చైనా మాంజాలు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయని తలసాని అన్నారు. ఆంధ్రలో పతంగుల పండుగ పెద్దగా జరుపుకోరని, తెలంగాణలోనే ఎక్కువుగా పతంగుల సందడి ఉంటుందని తలసాని గుర్తుచేశారు.
సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా నెక్లెస్ రోడ్ (PV మార్గ్) లోని పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/gfoQiqwOVN
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 14, 2023