DJ Tillu: డీజే టిల్లుతో కలిసి స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి
Minister Malla Reddy Dance with DJ Tillu Hero Sidhu
డీజే టిల్లు సినిమా హీరో జొన్నలగడ్డ సిద్ధు కెరీర్ గ్రాఫ్‌ని పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా హిట్ సాధించడంతో ఆ సినిమా హీరో సిద్ధుకి పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. క్రేజీ హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. డీజే టిల్లు సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్నా ఆ సినిమా టైటిల్ సాంగ్ మాత్రం ఇంకా హల్‌చల్ చేస్తునే ఉంది. చాలా ఫంక్షన్లలో అదే సాంగ్ ప్లే చేస్తూ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.
గతంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ ఓ కార్యక్రమంలో డీజే టిల్లు సాంగ్‌కు స్టెప్పులేశారు. చాలా హుషారుగా డాన్స్ చేశారు. చుట్టుపక్కల వారిలో జోష్ నింపారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా డీజే టిల్లు సాంగ్‌కు స్టెప్పులేశారు. హీరో సిద్ధుతో కలిసి డాన్స్ చేశారు.
మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజే టిల్లు ఫేమ్ హీరో జొన్నలగడ్డ సిద్ధు స్పెషల్ గెస్టుగా హాజరయ్యాడు. యూనివర్సిటీ గ్రౌండ్స్ లో నిర్వహించిన రంగోలీ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. కాలేజీ అధిపతి అయిన మల్లారెడ్డి విద్యార్ధులతో మమేకం అయ్యారు. హీరో సిద్దుతో కలిసి స్టెప్పులు వేశారు. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.
మల్లారెడ్డికి డాన్సులు చేయడం కొత్త కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మల్కాజ్‌గిరిలో జరిగిన పార్టీ సభలో సహచర ఎమ్మెల్యే కృష్ణా రావుతో కలిసి స్టెప్పులు వేశారు. అదే విధంగా మునుగోలు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో వెళుతూ ఓపెన్ టాప్‌లో డాన్స్ వేశారు. సందడి చేశారు.
Minister Malla Reddy shakes leg with Actor Siddu #DJTillu in Medchal pic.twitter.com/4VhM1ouESC
— Sarita Avula (@SaritaTNews) January 11, 2023