Minister Ktr: కేసీఆర్ పాన్ఇండియా లీడర్..కేటీఆర్
Minister Ktr: కంటెంట్ ఉన్న సినిమా పాన్ ఇండియా చిత్రం అవుతుంటే.. అలాంటిది కంటెంట్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియాకు వెళ్లలేరా? కంటెంట్ ఉంటే ఎవరైనా పాన్ ఇండియా లీడర్ అవుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కంటెంట్ ఉన్న లీడర్ అని అందుకే మేము పాన్ ఇండియాకు వెళ్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు సినిమా ఎక్కడికో వెళుతోంది. త్వరలో హైదరాబాద్ భారతదేశానికి చలనచిత్ర రాజధానిగా మారుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నిర్మాతలను ఆకర్షిస్తుంది” అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభించి విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సినిమా దర్శకుడు దశరథ్ రాసిన ‘కథారచయిత’ పుస్తాకావిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, క్రియేటీవ్ కంటెంట్ అంటే తనకు చాలా ఇష్టమని, అమెరికాలో ఉన్నప్పుడు కూడా విరివిగా పుస్తకాలు చదివే వాడినని రోజూ దాదాపు11- 12 పత్రికలు చదివేవాడినని చెప్పారు. అలాగే మంచి బుక్స్ కనపడినా చదువుతానని వెల్లడించారు. అమెరికా లో మాక్ డేమిన్ వాళ్ళు రాసిన స్క్రీన్ ప్లే బుక్ ను చదివానని..తెర వెనుక ఉన్న టెక్నీషియన్స్ కు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో దర్శకులు వివి వినాయక్, హరీష్ శంకర్ , నాగ్ అశ్విన్ లు పాల్గొన్నారు.