KTR: మునుగోడు ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. నారాయణ పూర్ లో రోడ్ షో ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు మంత్రి కేటీఆర్. ప్రచార పర్వం ముగిశాక గెలుపు వ్యూహాలతో, ఎత్తులు పైఎత్తులతో మరింత బిజీ అయిన కేటీఆర్ కానీ మానవత్వం మాత్రం మరచిపోలేదు. కాన్వాయ్ లో మునుగోడు నుండి హైదరాబాద్ కి పయనమయ్యారు.. రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయినవారిని చూసి కాన్వాయ్ ఆపారు. నేరుగా మంత్రి కేటీఆర్ వారి వద్దకు వెళ్లారు. బాధితులతో మాట్లాడారు. వారు కదల్లేని స్థితిలో ఉండటంతో తన కాన్వాయ్ లో ఎక్కించుకుని హైదరాబాద్ ఆస్పత్రికి చేర్చారు. వారి వివరాలు సేకరించారు.
కల్వకుర్తికి చెందిన ఆ భార్యా భర్తలిద్దరూ తమ పాపని హాస్టల్ లో దించి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వారి బైక్ ప్రమాదానికి గురైంది. భార్యాభర్తలిద్దరూ దూరంగా పడిపోయారు. వారి చేతికి గాయాలయ్యాయి. లేవలేని స్థితిలో వారు రోడ్డు పక్కనే కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఆ మార్గం ద్వారా రావడంతో వారిని ఆస్పత్రికి చేర్చడం సులభం అయింది. నేరుగా మంత్రి తన కాన్వాయ్ ఆపి దిగి రావడం చూసి బాధితులుఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆపద్బాంధవుడు @KTRTRS 🙏
మంత్రి కేటీఆర్ గారి మునుగోడు ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడింది చూసి తన కారును ఆపి స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు pic.twitter.com/RfbFSCeYsq
— Thirupathi Bandari (@BTR_KTR) November 1, 2022