మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన అరుణానాయర్కు మంత్రి కేటీఆర్ అధినందనలు తెలిపారు. హైదరాబాద్లో పుట్టి, అమెరికాలో ఎదుగుతున్న అరుణామిల్లర్కు కంగ్రాటులేషన్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Minister KTR compliments to Lieutenant governor of Maryland Aruna Miller
మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన అరుణానాయర్కు మంత్రి కేటీఆర్ అధినందనలు తెలిపారు. హైదరాబాద్లో పుట్టి, అమెరికాలో ఎదుగుతున్న అరుణామిల్లర్కు కంగ్రాటులేషన్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Congratulations Aruna Miller, Lieutenant Governor-elect of Maryland 👍
Born in Hyderabad & Now soaring high in the USA https://t.co/7Dk8amvKJe
— KTR (@KTRTRS) November 10, 2022
చరిత్ర సృష్టించిన అరుణా మిల్లర్
మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా 58 ఏళ్ల అరుణా మిల్లర్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా… మేరీలాండ్ గవర్నర్ పదవి కోసం పోటీ నెలకొంది. డెమోక్రటిక్ నాయకుడు వెస్ మూర్ గవర్నర్ పదవి కోసం, లెఫ్టినెంట్ గవర్నర్ స్థానానికి అరుణా మిల్లర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై వీరిద్ధరూ గెలుపొందారు. వీరు ఎన్నికల్లో గెలవాలని అధ్యక్షుడు బో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేరీలాండ్ లో పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశాడు. మేరీలాండ్లో అరుణకు ప్రజాదరణ కాస్త ఎక్కువగానే ఉంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలవడం విశేషం.