Minister Ktr: జిల్లాల బీఆర్ఎస్ ఇన్‌చార్జులను నియమించిన కేటీఆర్
Minister Ktr: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. అలాంటి అవకాశమే లేదని షెడ్యూల్ నిబంధన ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు. డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయని పేర్కొంటూ నేతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఇక జిల్లాలో, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచించారు.
సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేతలందరూ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కసరత్తు మొదలు పెట్టారు. జిల్లాల వారీగా ఇన్‌చార్జులనూ నియమించినట్లు తెలిపారు.
బి.వెంకటేశ్వర్లు-సిద్దిపేట, ఆదిలాబాద్, ఎంసీ కోటిరెడ్డి, మేడ్చల్, బస్వరాజు సారయ్య-కరీంనగర్, సిరిసిల్ల- కడియం శ్రీహరి-నల్లగొండ, ఎల్.రమణ-రం గారెడ్డి, భానుప్రసాద్-కొత్తగూడెం, వెంకట్రామిరెడ్డి- సంగారెడ్డి, ఎగ్గె మల్లేశం-మెదక్, శేరి సుభాష్‌రెడ్డి- ఖమ్మం, కె.నారాయణరెడ్డి-మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, పల్లా రాజేశ్వర్‌రెడ్డి- యాదవరెడ్డి-యాదాద్రి, మహేందర్‌రెడ్డి-నా గర్‌కర్నూల్, వి.గంగాధర్‌గౌడ్-నిర్మల్, -జనగామ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి -వికారాబాద్, విఠల్-కామారెడ్డి, బండ ప్ర కాశ్-నిజామాబాద్, ఎమ్.ఎస్.ప్రభాకర్-హనుమకొండ, వరంగల్- ఎర్రోళ్ల శ్రీనివాస్-పెద్దపల్లి, ఎ.నర్సారెడ్డి-భూపాలపల్లి, ములుగు- ఆసిఫాబాద్- పురాణం సతీశ్-మహబూబాబాద్, దాసోజు శ్రావణ్-హైదరాబాద్, కె.దామోదర్-జగిత్యాల, ఎం.శ్రీనివాస్-సూర్యాపేట. తక్కళపల్లి రవీందర్‌రావు-వనపర్తి, లక్ష్మణరావు-మంచిర్యాల