Minister Harishrao: మెదక్ – సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే వెళ్లే గ్రామాల వద్ద నాలుగు లైన్ల రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సైడ్ డ్రైన్లు, రేలింగ్, ఫుట్‌పాత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆర్అండ్బీ అధికారులతో మంత్రి హైవేకు సంబంధించిన విషయాలపై సమీక్షించారు. రీచ్ -1 నేషనల్ హైవే సిద్ధిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు, రీచ్ -2 నేషనల్ హైవే మెదక్ జిల్లాలో మెదక్ టౌన్ నుంచి నిజాంపేట వరకు నిర్మాణం సాగనున్నట్లు మంత్రి తెలిపారు.
గ్రామాల వెంట 4 లైన్ రోడ్, స్ట్రీట్ లైట్స్, ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా రేలింగ్, ఇరువైపులా వర్షపు నీరు నిలువకుండా సైడ్ డ్రైన్లు, ఫుట్ పాత్‌లు నిర్మించాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో ఎన్సాన్పల్లి జంక్షన్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు ఇరు వైపులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మెదక్ జిల్లాలో అక్కన్నపేట్ వద్ద రైల్వే ట్రాక్ ఉండటంతో అక్కడ వాహనాల పోయేందుకు రైల్ అండర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. రోడ్ నిర్మాణంతో సిద్ధిపేటలో నాలుగు మేజర్ జంక్షన్లు, 19 మైనర్ జంక్షన్లు మెదక్ జిల్లాలో నాలుగు మేజర్ జంక్షన్లు, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి కానున్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పారు. భూసేకరణకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
national highway