Harish Rao: తెలంగాణకు కేంద్రం సహాయ నిరాకరణ, 40 వేల కోట్ల నిధులు పెండింగ్-హరీశ్‌రావు
Minister Harish Rao questions Central government for No n payment of Funds
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ నిరాకరణపై మంత్రి హరీశ్‌రావు మరోసారి మండిపడ్డారు. నిధులు మంజూరు చేయకుండా కేంద్రం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే 150 కోట్లు కేంద్రం తీసుకుందని, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టలేదని కేంద్రం 12 వేల కోట్లు ఆపిందని హరీశ్‌రావు గుర్తుచేశారు.
15 వేల కోట్ల కోసం FRBM తీర్మానం చేసినా కేంద్రం ఇవ్వలేదని మంత్రి హరీశ్ తెలిపారు. 15వ ఆర్ధిక సంఘం నుండి రావాల్సిన 5300 కోట్లు ఇవ్వలేదని, మొత్తంగా రాష్ట్రానికి కేంద్రం నుండి 40 వేల కోట్లు రావాల్సిన నిధులు రాలేదని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాకు ఓ ప్రత్యేక ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 86 శాతం డెలివరీలు అవుతున్నాయని తెలిపారు.