పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ రైతాంగ సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. సమస్యల పరిష్కరానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా ధాన్యం సేకరణ అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన గంగుల కమలాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Minister Gangula Kamalakar instructions to Collectors on Paddy Procurement
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ రైతాంగ సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. సమస్యల పరిష్కరానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా ధాన్యం సేకరణ అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన గంగుల కమలాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైస్ మిల్లుల వద్ద స్పేస్ లేకున్నా, మిల్లులు సహకరించకున్నా… తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించండని ఆదేశించారు.
గతం కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని గుర్తుచేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సేకరణ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని, రాజకీయాలు పట్టించుకోకండి, రైతులకు అండంగా ఉండండని అధికారులకు సూచించారు. తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కావద్దని అధికారులకు సూచించారు. అందుకు రైతులు ఖచ్చితంగా ఎఫ్.ఏ.క్యూ ధాన్యం తెచ్చేలా చూడండని సూచించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని గంగుల కమలాకర్ తెలియజేశారు.నీళ్లు, కరెంటుతో పాటు ఎంఎస్పీతో కొనుగోళ్లు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గర్వం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించారు. ట్రాన్స్ ఫోర్ట్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ట్రాక్టర్లను సైతం వాడుకోండని అధికారులకు సూచించారు. పక్క రాష్ట్రాల్లో కొనుగోళ్లు లేనందున ఆ ప్యాడీ రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. రాబోయే పదిరోజులు అత్యంత కీలకం, యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండండని సూచించారు.