Microsoft Data Centers in Hyderabad: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు
Microsoft Data Centers in Hyderabad: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాప్ట్ హైదరాబాద్ నగరంలో మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే నగరంలో సుమారు 16 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధమౌతున్నది. ఇందులో భాగంగానే మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలను దావోస్ వేదికగా జరుగుతునన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సమర్పించారు. ఒక్కో డేటా సెంటర్‌ను 100 మెగావాట్ల ఐటీ లోడ్ కెపాసిటీతో ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఓప్పందం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా కేటీఆర్ దావోస్ సదస్సులో పాల్గొన్నారు. వివిధ కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ అవుతున్నారు. అంతర్జాతీయ కంపెనీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, మద్దతును, హైదరాబాద్‌లో ఉన్నవనరులను కంపెనీలకు వివరిస్తున్నారు. ఇక ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. మరిన్ని కంపెనీలు నగరానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సహజవనరులతో పాటు మానవ వనరులు కూడా సమృద్ధిగా ఉండటంతో హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి.