KTR: సత్య నాదెళ్లతో బిజినెస్ గురించి, బిర్యానీ గురించి చర్చించా-కేటీఆర్
Micro Soft CEO Satya Nadella meets IT Minister KTR
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. నిన్న ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ రోజు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. సత్యనాదెళ్లతో జరిగిన భేటీ గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇద్దరు హైదరాబాదీలము ఈ రోజు కలిశామని, బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
— KTR (@KTRTRS) January 6, 2023
నిన్న ప్రధానిని కలిసిన సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల జనవరి 5న ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. డిజిటల్ ఇండియా విజన్ విషయమై ప్రధానితో చర్చించారు. భారత్ విజన్‌కు సహకారం అందిస్తామని ప్రకటించారు. డిజిటల్ పరివర్తన తీసుకురావడం ద్వారా భారతదేశ ఆర్ధిక పురోగతికి పాటు పడుతున్న ప్రభుత్వ విధానం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని సత్య నాదెళ్ల తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఫ్యూచర్ రెడీ టెక్ సమిట్‌లో
డిజిటల్ పరివర్తన విషయంలో భారతదేశం చూపుతున్న చొరవను ప్రశంసించారు. ఆర్ధిక ప్రగతిలో టెక్నాలజీ పాత్రను గుర్తించినందుకు అభినందించారు. టెక్నాలజీపై దేశం చేస్తున్నఖర్చు ప్రతి ఏడాది పెరుగుతోందని, జీడీపీలో టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తున్న మొత్తం చాలా ఎక్కువుగా ఉందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఖర్చుచేస్తున్నట్లే భారతదేశం కూడా ఖర్చు చేస్తోందని తెలిపారు. ఫ్యూచర్ రెడీ టెక్ సమిట్‌లో పాల్గొన్న సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.