Suicide at Tarnaka: పండగపూట విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య?
Mass Suicide at Tarnaka: సికింద్రాబాద్ పరిధి తార్నాకలో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. నాలుగేళ్ల పిల్లను చంపి ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూపాలి అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని ప్రతాప్ వయసు 34 సంవత్సరాలు కాగా బీఎండబ్ల్యూ కార్ షోరూమ్ లో డిజైన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఆయన భార్య సింధూర వయసు 32 సంవత్సరాలు కాగా ఆమె హిమాయత్ నగర్ లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వారి పాప ఆద్యకు ఫోర్ ఇయర్స్ కాగా ప్రతాప్ వాళ్ళ అమ్మ కూడా ఆత్మహత్య చేసుకున్నారని తేలింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నా మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ముగ్గురిని చంపిన తర్వాత ప్రతాప్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రాథమికంగా ఆ కుటుంబానికి సన్నిహితుల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే చెన్నై వెళ్లే విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైనట్టు అనుమానిస్తున్నారు.