Manik Rao Thackeray: ఈ నెల 20న హైదరాబాద్‌కు మాణిక్ రావ్ ఠాక్రే
Manik Rao Thackeray: గత వారం కిందట హైదరాబాద్ కి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మొదటిసారిగా హైద్రాబాద్ కి వచ్చి నేతలతో సమావేశాలు నిర్వహించారు. సీనియర్లకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. అలాగే విబేదాలు పక్కనపెట్టి రాష్టంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేలా ప్రతిఒక్కరి కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈనెల 26 నుంచి కాంగ్రెస్ చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి పార్టీ నేతలు, అనుబంధ సంఘాలను పూర్తిగా సమాయత్తపర్చేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే 20న హైదరాబాద్ రానున్నారు. మూడురోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. మొదటిరోజు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీలతో గాంధీభవన్‌లో విడివిడిగా భేటీ కానున్నారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇంచార్జి కార్యదర్శులతో సమావేశమవుతారు.
రెండవరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలోఠాక్రే పాల్గొననున్నారు. సాయంత్రం ఎన్‌ఎస్ యూఐ, సేవాదళ్, యూత్ కాంగ్రెస్, కార్యవర్గాలతో విడివిడిగా సమావేశం కానున్నారు. మూడవరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ సీనియర్ నాయకులతో భేటీ కానున్నారు.అదే రోజు నాగర్ కర్నూల్ కు వెళ్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొననున్నారు.