Majaruddin: అక్బరుద్దీన్ వియ్యంకుడు సూసైడ్.. అందుకేనా?
Majaruddin: కుటుంబ తగాదాల కారణంగా అక్బర్ వియ్యంకుడు మజార్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మజార్ కొడుక్కి అక్బరుద్దీన్ కూతురుతో వివాహం జరిగింది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12 లో తన ఇంట్లో మజార్ ఆత్మహత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన మజార్ ని ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మజార్ చనిపోయారు. మజారుద్దీన్ అలీఖాన్ వయసు 60 ఏళ్లు కాగా ఓవైసీ ఆసుపత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ కు వియ్యంకుడు అని, ఉదయం 10. 15 నిమిషాలకు ఇంట్లో బెడ్ రూమ్ లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు శబ్దాలు రావడంతో బెడ్రూమ్ లోకి వెళ్లిన మజారుద్దీన్ వ్యక్తిగత కార్యదర్శి తాజుద్దీన్ కు రక్తపు మడుగులో ఉన్న మజారుద్దీన్ కనిపించాడు, దీంతో ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించాడు తాజుద్దీన్. ఆసుపత్రికి తరలించే లోపే మజారుద్దీన్ చనిపోయినట్టు చెబుతున్నారు. ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణం అంటున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారు.