Lushkar Bonalu Bhavishyavani: నేటితో ముగియనున్న ఉజ్జయినీ అమ్మవారి బోనాలు..భవిష్యవాణిలో అమ్మ ఆగ్రహం
Lushkar Bonalu Bhavishyavani: ఆషాఢమాసం బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటితో ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా అంబారిపై అమ్మవారిని ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పూజలు కేవలం మొక్కుబడిగా చేస్తున్నారని, సంతోషంగా పూజలు చేయడం లేదని భవిష్యవాణి పేర్కొన్నారు. తనకు పూజలు సైతం సరిగా జరపడం లేదని, ప్రతీ ఏటా చెబుతున్నా పట్టించుకోవడం లేదని, టెక్నకు సక్రమంగా పూజలు జరిపించాలని అన్నారు.
ఇప్పటి వరకు ఎలా చేసినా సరిపెట్టుకున్నానని, తాను భక్తుల హృదయాల్లోకి దూరి కాపాడుతున్నానని అన్నారు. ఏటికేటా తన రూపాన్ని మారుస్తున్నారని, తనకు స్థిరమైన రూపం కావాలని చెప్పారు. అక్కడ ఉన్నదంతా తనదేనని తనదంతా కాజేస్తున్నారని మండిపడ్డారు. తాను సంతోషంగా లేకపోయినా…. అందర్నీ సంతోషంగా ఉండేలా చూస్తున్నానని తెలిపారు. ప్రతీ ఏటా తనకు ఆటంకమే కలిగిస్తున్నారని, నా బిడ్డలే కదా అని సరిపెట్టుకుంటున్నానని అన్నారు. ప్రజలందరూ తనను కనులారా వీక్షించుకునేలా పూజలు జరిపించాలని అన్నారు.