Lunar Eclipse on November 8th Full Details Here: ఈ సంవత్సరం రెండవ చివరి చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీ అంటే రేపు ఏర్పడబోతుంది. ఈ సారి చంద్రగ్రహణం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది. అయితే మధ్యాహ్న సమయంలో చంద్రగ్రహణం రావడంతో, అది కూడా భారత దేశంలో పాక్షిక చంద్ర గ్రహణం ఉండడంతో చంద్ర గ్రహణాన్ని మనం చూసే అవకాశం తక్కువే. అయినప్పటికీ చంద్రగ్రహణం ప్రభావం మనపై ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా.. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుంది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు వరకు చంద్రగ్రహణం కొనసాగుతోంది. ఇక భారత్లో గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకు కనిపించే అవకాశం ఉంది. దేశంలో 45 నిమిషాల 48 సెకెన్ల పాటు దర్శనమిస్తుంది అబూ కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఢిల్లీలో చంద్రగ్రహణం 5.28 గంటలకు, ముంబైలో 6.01 గంటలకు హైదరాబాద్లో 5.40 గంటలకు చంద్రగ్రహం కనిపించనుందని అంచనా.