మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి వామపక్షాలతో పొత్తు కలిసివచ్చిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మునుగోడులోని కొన్ని ప్రాంతాల్లో వామపక్షాలకు మంచి పట్టు ఉన్నది. ఎన్నికల్లో విజయాన్ని సాధించిపెట్టలేకపోయినా, గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నది. మొదట వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నించింది.
Munugodu: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి వామపక్షాలతో పొత్తు కలిసివచ్చిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మునుగోడులోని కొన్ని ప్రాంతాల్లో వామపక్షాలకు మంచి పట్టు ఉన్నది. ఎన్నికల్లో విజయాన్ని సాధించిపెట్టలేకపోయినా, గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నది. మొదట వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నించింది. దీనికోసం పెద్ద ఎత్తున చర్చలు కూడా చేసింది. కానీ, అనూహ్యంగా కేసీఆర్ రంగంలోకి దిగి వామపక్షాలతో చర్చలు జరిపారు. వారి మద్దతును కోరారు.
టీఆర్ఎస్ పార్టీతో పొత్తులకు సై అనడంతో పోరు రసవత్తరంగా మారింది. వామపక్షాలకు మర్రిగూడ, గట్టుప్పల్, నాంపల్లి మండలాల్లో మంచి పట్టు ఉన్నది. కొంతమేర బలమైన ఓటుబ్యాంకు ఉన్నది. ఈ పొత్తు కారణంగానే టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో విజయం సాధించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వామపక్షాల ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సైతం 25 వేలకు పైగా ఓట్లను సాధించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా, పూర్తి స్థాయిలో ఓట్లను బీజేపీకి టర్న్ చేయడంలో విఫలమయ్యారు. సంప్రదాయాన్ని పాటించే ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు.