Hyderabad: చిక్కడపల్లిలో కాల్పుల కలకలం..లైసెన్స్ రివాల్వర్ తో…
Hyderabad Lawyer Commits Sucide: హైదరాబాద్ చిక్కడపల్లిలో కాల్పులు కలకలం రేపాయి.కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన లైసెన్సడ్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఎయిర్‌ఫోర్స్‌లో కొన్నాళ్ల క్రితమే శివారెడ్డి పదవీ విరమణ చేశాడు. ఎయిర్‌ఫోర్స్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.కొద్ది రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడు.
కడప నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుని తిరిగి బయటకు రాలేదు. బంధువులు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన బంధువులు శివారెడ్డి ఇంటికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. న్యాయవాది ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.