Lal Darwaja Bonalu : ఘనంగా లాల్ దర్వాజా బోనాలు – Live Updates
Lal Darwaja Bonalu Live Updates: హైదరాబాద్ పాతబస్తీలో బోనాల సందడి మొదలైంది. భారీ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా ఇళ్లకే పరిమితం అయిన ప్రజలు బయటకు వచ్చి బోనాలల్లో భారీగా పాల్గొంటున్నారు. ఆదివారం, సోమవారం లాల్‌దర్వాజా మహంకాళి బోనాల ఊరేగింపు ఘనంగా జరగనుంది. లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్ధరాత్రి నుంచే ఆలయం దగ్గర కోలాహలం కనిపిస్తోంది. తెల్లవారుజామునుంచే సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించన్నారు మంత్రులు.
కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న తలసానికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
లాల్ దర్వాజ అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
బోనాల పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
లాల్ దర్వాజ్ బోనాలకు రావడం సంతోషంగా ఉందని క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటానన్న ఆమె గత సంవత్సరం రాలేక పోయానని, కోవిడ్ కారణంగా ఆలయానికి రాలేదని అన్నారు. ఈరోజు మళ్ళీ లండన్ వెళుతున్నాను అని ఆమె అన్నారు. ఈ సంధర్భంగా పౌరులందరికి బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు.