K.T.R tweet: ఉభయ సభల్లో పదాల నిషేదంపై కేటీఆర్ ఎద్దేవా, బీజేపీ నాయకులపై సెటైర్లు
లోక్సభ సచివాలయం రెండు రోజుల క్రితం ఓ పదాల జాబితాను విడుదల చేసింది. అటువంటి పదాలను ఇక నుంచి ఉభయ సభల్లో ఉపయోగించవద్దని కోరింది. ఎంపీలు ఉపయోగించే కొన్ని పదాలపై లోక్సభ సచివాలయం కత్తెర వేసింది. నిషేదిత పదాలను ఇక నుంచి ఎంపీలు వినియోగించరాదని కోరింది. ఈ విషయమై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. గత కొంత కాలంగా బీజేపీ నాయకులు వాడుతున్నకొన్నిఅభ్యంతరకర పదాలను ట్వీట్ చేశారు. పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆఫ్ NPA గవర్నమెంట్ అంటూ కొన్ని పదాలను పొందుపరిచారు.
కేటీఆర్ ఎద్దేవా
నిరసనకారులను ఉద్దేశించి ప్రధాని మోడీ ఉపయోగిస్తున్న ఆందోళన్ జీవి అనే పదం సరైనదే
గోలీ మార్ దో సోలోంకో అంటూ ఓ మంత్రి వ్యాఖ్యానిస్తే అది సరైనదే
80-20 అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్ సరైనవే
మహాత్మాగాంధీని ఓ బీజేపీ ఎంపీ తక్కువ చేస్తూ మాట్లాడితే అది సరైనదే
ఉద్యమం చేస్తున్న రైతులను టెర్రరిస్టులతో పోల్చితే అది సరైనదే అంటూ బీజేపీ నాయకులను కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఈ పదాలపై ఇక నుంచి ఉభయ సభల్లో నిషేధం
జుమ్లాజీవి, బాల్బుద్ధి, కోవిడ్ స్పెడర్, స్నూప్ గేట్ వంటి పదాలను ఇక నుంచి ఉపయోగరాదని లోక్సభ సెక్రటేరియట్ ఎంపీలను కోరింది. వీటితో పాటు డ్రామా (Drama), కరప్ట్ (Corrupt), హిపోక్రసీ (Hypocracy), బిట్రేయ్డ్ (Betrayed), ఎబ్యూస్డ్ (abused), ఇన్కాంపిటెంట్ (Incompitenent) వంటి పదాలను అన్ పార్లమెంటరీ పదాలుగా వ్యవహరించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
లోక్సభ సెక్రటేరియట్ నిషేధించిన మరికొన్ని పదాలు
అనార్కిస్ట్ (anarchist), శకుని, డిక్టేటోరియల్(Dictatorial) తానాషా (Taanashah), తానాషీ (Taanashahi), జై చంద్ (Jai Chand), వినాష్ పురుష్ (Vinash Purush), ఖలిస్తానీ (Khalistani), ఖూన్ సే ఖేతీ (Khoone Se Kheti), దోహ్రా చరిత్ర (Dohra Charitra), నికమ్మ (Nikamma), నౌటంకీ (nautanki), ధిందోరా పీట్నా (Dhindora Peetna), బెహరీ సర్కార్ (Behri Sarkar) వంటి పదాలు ఇక నుంచి ఎంపీలు వినియోగరాదని లోక్సభ సచివాలయం కోరింది.
విమర్శల వర్షం
పదాల ఉపయోగంపై కత్తెర వేసిన కొన్ని గంటల్లోనే దేశంలో పలు రాజకీయ నాయకులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టీఎంసీ ఎంపీ డెరెక్ బో బ్రెయిన్, రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
నేనే ఆ పదాలను వాడతా..నన్ను సస్పెండ్ చేయండి
టీఎంసీకి చెందిన సీనియర్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా పదాల కత్తెర విషయంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ సచివాలయం ప్రకటించిన జాబితాలోను చాలా పదాలను తాను ఉపయోగిస్తానని, తనను సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు. ప్రజాస్వామ్యం కోసం తాను పోరాటం చేస్తానని ట్వీట్ చేశారు.
న్యూ డిక్షనరీ ఫర్ న్యూ ఇండియా
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. న్యూ డిక్షనరీ ఫర్ న్యూ ఇండియా అంటూ ఓ ట్వీట్ చేశారు. మోడీ పాలనను సరిగ్గా తెలియజేస్తూ డిబేట్లలోను, చర్చల్లోను వాడే పదాలను ఇక నుంచి వాడకుండా నిషేధించారంటూ ట్వీట్ ముగించారు.