KTR: హైదరాబాద్ లో ఈ ప్రదేశాలను మీరు చూశారా ?
KTR tweet on Hamara Hyderabad
హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా హైదరాబాద్ నగరంలో పర్యటించి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పర్యాటక ప్రాంతాలన్నీ ఇటీవల కాలంలో కొత్త రూపు దిద్దుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పర్యాటక శాఖ కొత్త ఉత్సాహంతో పరుగులు పెడుతోంది. పర్యాటక ప్రాంతాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి.
గత కొన్నేళ్లలో హైదరాబాద్ నగరంలో కొత్త నిర్మాణాలు జరిగాయి. పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అటువంటి కొత్త హంగులు సంతరించుకున్న హైదరాబాద్ నగరాన్ని చిత్రీకరిస్తూ రూపొందించిన ఓ వీడియోను పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హమారా హైదరాబాద్ అనే పేరుతో ఉన్న ఈ వీడియోలో హైదరాబాద్ నగరంలో పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ సంస్థల గురించి తెలియజేశారు. హైదరాబాద్ వాసిని అయినందుకు గర్వపడుతున్నానంటూ ట్వీట్ ముగించారు.
కేటీఆర్ ట్వీట్ చేసిన ఆ వీడియోలో ఉన్న 17 ప్రదేశాలు ఇవే. మీరూ ఓసారి లుక్కేయండి.
Gandipet park (గండిపేట పార్క్)
Bansilalpet stepwell (బన్సీలాల్ పేట మెట్లబావి)
T Hub (టీ హబ్)
Command control Centre (కమాండ్ కంట్రోల్ సెంటర్)
Shaikpet Flyover (షేక్ పేట్ ఫ్లై ఓవర్)
Mukthi Ghat (ముక్తి ఘాట్)
Tank Bund (ట్యాంక్ బండ్)
Secretariat (సెక్రటేరియట్)
Formula e street Race (ఫార్ములా ఈ స్ట్రీట్ రేస్)
Malkam cheruvu (మల్కం చెరువు)
Durgam Cheruvu (దుర్గం చెరువు)
Outer Ring Road (ఔటర్ రింగ్ రోడ్)
Hyderbad Metro (హైదరాబాద్ మెట్రో)
Mozam jahi Market (మొజం జాహీ మార్కెట్)
Charminar (చార్మినార్)
Mind Space Junction (మైండ్ స్పేస్ జంక్షన్)
Qutub Shahi Park (కుతుబ్ షాహీ పార్క్)
#HamaraHyderabad#ProudHyderabadi #Hyderabad ❤️ pic.twitter.com/y93wginL30
— KTR (@KTRTRS) January 23, 2023
..